29.7 C
Hyderabad
May 1, 2024 08: 16 AM
Slider ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ లో పెరిగిపోయిన సెంట్రలైజ్డ్ అవినీతి: కన్నా

#Kanna Laxminarayana

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రీకృతమైన అవినీతి జరుగుతోందని బీజేపీ సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 50 ఏళ్లలో ఇలాంటి అవినీతి ఎక్కడా చూడలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే పోలీస్ కేసులు పెట్టేస్తున్నారని ఇదేం పద్ధతతని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఒకప్పుడు పటిష్టంగా ఉండేదని…ఇప్పుడు సీఐడీ పటిష్టంగా ఉందని అన్నారు. రాష్ట్రానికి క్యాపిటల్ ఎక్కడ అని చెప్పుకోలేని స్ధితిలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందన్నారు. పోలీస్ వ్యవస్థ ప్రతిపక్షాలను అణగదొక్కడానికే పని చేస్తోందని విమర్శించారు. 2008 లో వైఎస్సార్ తెచ్చిన ఆన్‌లైన్ జీవోల విధానాన్ని జగన్ నిలిపివేశారన్నారు. రహస్య పాలన నడపాలి అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలకు డబ్బులు పంచుతున్నాం అనుకుంటే సరిపోదని…వాళ్ళు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. నేతల హౌస్ అరెస్ట్‌లు పరిపాటిగా మారాయని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

Related posts

సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

Satyam NEWS

దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ములుగు జిల్లా పోలీస్

Satyam NEWS

హుజూర్ నగర్ లో స్కానింగ్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment