40.2 C
Hyderabad
April 29, 2024 15: 07 PM
Slider ఆధ్యాత్మికం

హిందువులంతా సంఘటితం కావాలి

#All Hindus

హిందూ సమాజంపై దుర్మార్గమైన దాడి జరుగుతోందని.. అటు క్రైస్తవులు, ఇటు ముస్లింలు హిందూ సమాజాన్ని పీక్కుతింటున్నారని సాదు సంతులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక రుగ్మతల ఆధారంగా.. నిరక్షరాస్యత, పేదరికం కారణంగా మతమార్పిడి మహమ్మారి హిందుత్వం పై భీకరమైన దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మంగళవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు మఠాలు పీఠాల సాధువులు సంతులు ప్రముఖులతో సమావేశం నిర్వహించింది. కాచిగూడ లోని శ్రీ శ్యాం బాబా మందిర్ లో నిర్వహించిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి 110 మంది ప్రముఖ స్వామీజీలు హాజరయ్యారు.

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాధువులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం ఐదు గంటల దాకా సుదీర్ఘంగా కొనసాగింది.
స్వామీజీలు అందరూ హిందూ ఐక్యత కోసం కట్టుబడి పని చేయాలని ప్రతినబూనారు.

ప్రముఖంగా ఆరు అంశాలపై తీర్మానాలు చేశారు.

1) మతమార్పిడిని తీవ్రంగా ప్రతిఘటించడం.
2) ఆదర్శ హిందూ కుటుంబ జీవనాన్ని ప్రోత్సహించడం.
3) ప్రతి దేవాలయం హిందువులకు కేంద్రంగా చేయాలి.
4)ప్రభుత్వ ఆధీనంలోని దేవాలయాలను హిందువులకు అప్పగించి, స్వతంత్రత ప్రకటించడం.
5) గ్రామీణ ప్రాంతాల్లో సాధుసంతులు విరివిగా పర్యటన చేసి హిందూ బంధువులకు భరోసానింపడం.
6)ప్రతి హిందువుకు హనుమాన్ చాలీసా పై అవగాహన పెంచి, హనుమాన్ చాలీసా పరాయణం చేయించడం.

ఈ ఆరు తీర్మానాలను స్వాములు, విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు, పెద్దలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వామీజీల పరిటన వల్ల సురక్ష, సేవ, సంస్కార్ ఈ మూడు గుణాలు అలవడితే హిందూ సమాజం బలపడుతుందని అభిప్రాయపడ్డారు. మతం మారుతున్న సమాజాన్ని జాగృతం చేసి హిందూ సమాజ ఐక్యత కోసం తీవ్రంగా కృషి చేయాలన్నారు.

మతం మారిన హిందూ సోదరులను సాధారంగా హిందుత్వంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి స్వామీజీపై ఉందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి పై దాడి చేస్తున్న విదేశీ సంప్రదాయాల్ని రూపుమాపాలని చెప్పారు. పప్పు ,ఉప్పు, బియ్యానికి 10,000 రూపాయలకు మతం మారుస్తున్న మిషనరీల భాగోతం ప్రపంచానికి తెలియజేయాలని స్వామీజీలు అభిప్రాయపడ్డారు.

ప్రతి దేవాలయం కేంద్రంగా హిందూ సమాజం సంగటితమై స్వావలంబన సాధించాలని సూచించారు. కులాల పేరుతో, వర్గాల పేరుతో ఎవరికి వారుగా జీవిస్తున్న హిందూ సమాజం మనసులో హిందుత్వాన్ని బలంగా నాటాలని చెప్పారు. దేవాలయాల భూములు, హిందువుల ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న ముఠాల భరతం పట్టాలన్నారు.

ఎవరికివారుగా ఉండడం వల్లే నేడు అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని… దానివల్ల హిందూ సమాజం అనేక గాయాలకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నేడు హిందూ సమాజం పొరపాట్లను చేయకుండా భవ్యమైనటువంటి భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు ప్రతి స్వామీజీ ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో ప్రముఖ స్వామీజీలు శ్రీ సంగ్రామ మహారాజ్, యోగానంద సరస్వతి, కమలానంద భారతి, దుర్గాప్రసాద్, సోమాయప్ప స్వామి, చైతన్యానంద మహారాజు, విశ్వహిందూ పరిషత్ నేతలు నాగరాజన్, రాఘవులు, సత్యం జీ, యాదిరెడ్డి, పుప్పాల వెంకటేశ్వరరావు, రామరాజు, జగదీశ్వర్, భాను ప్రసాద్, యాదగిరి రావు, శశిధర్, వెంకటేశ్వర రాజు, రమేష్, పగుడాకుల బాలస్వామి, శివ రాములు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

డ్రంక్ అండ్ డ్రైవ్: రెండు బైకులు ఢీ ముగ్గురికి గాయాలు

Satyam NEWS

అంబర్ పేట్ లో సుంకపాక దేవన్న సంస్మరణ సభ

Satyam NEWS

ఒక పూట అన్నం మానేసి పేదలకు పంచిపెట్టండి

Satyam NEWS

Leave a Comment