29.7 C
Hyderabad
April 29, 2024 07: 30 AM
Slider నల్గొండ

ఈనెల 28,29 తేదీలలో జరిగే సమ్మెను జయప్రదం చేద్దాం

#nationalbundh

హమాలి వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు మేకల నాగేశ్వరరావు

కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 28,29 తేదీలలో హుజూర్ నగర్ పట్టణం లోని అన్ని రైస్ మిల్లు కార్మికులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని హమాలి వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు మేకల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని హమాలి వర్కర్స్ యూనియన్ శ్రామిక భవనంలో గురువారం ఐ ఎఫ్ టి యు పట్టణ అధ్యక్షుడు పాతబోయిన గురవయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హమాలీ సంఘం గౌరవ అధ్యక్షుడు మేకల నాగేశ్వరరావు మాట్లాడుతూ రక్తతర్పణ చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చటం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు.

దేశవ్యాప్తంగా పరిశ్రమలు మూసివేసి లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతుంటే ఉన్న కార్మికులకు సంఘం పెట్టుకుని సమ్మె చేసే హక్కులను కూడా లేకుండా చేయడం భారత పాలకవర్గాలు ఎవరు పక్షాన నిలబడ్డాయో వాటి నిజస్వరూపం ఏమిటో ప్రజలు, కార్మికులు అర్థం చేసుకుంటున్నారని  పారిశ్రామిక కోడ్ చట్టాలతో సామాజిక భద్రత,వృత్తి సంబంధిత రక్షణ,ఆరోగ్య సంబంధిత భద్రత ప్రశ్నార్ధకంగా మారిందని అన్నారు.

8 గంటల పని బదులు ఇప్పటికే సాఫ్ట్ వేర్ రంగాలలో 12 అమలు చేయబడుతుందని. తర రంగాలలో బలవంతంగా అమలు కోరుకుంటున్నారని,పనిచేసే సుమారు 50 కోట్ల మంది కనీస వసతులకు నోచుకోక అనాధలుగా మారుతున్నారని అన్నారు.మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బరితెగించి విదేశీ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందని,కోట్లాది మంది నోరు కొట్టి అంబానీ,ఆదానీలకు దోచిపెడుతుందని అన్నారు.నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదామని ఐఎఫ్టియు అనుబంధ హమాలీ కార్మిక సంఘం కార్మికులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి,పట్టణ కార్మిక వర్గాలకు, ప్రజలు,మేధావులు,ఉపాధ్యాయులు కార్మిక లోకానికి,అన్ని సంఘాలు మద్దతు తెలియజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు మన్నెం పెద నాగేశ్వరరావు, ఐ ఎఫ్ టి యు పట్టణ కార్యదర్శి నాయకుడు వీరయ్య,ప్రభుదేవా, హుస్సేన్,రాజు,నరేంద్ర,ప్రసాద్,వినోద్, అశోక్ యాదవ్,మోహన్,చిన్న నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

అంబరాన్నంటిన సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

Satyam NEWS

టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

Satyam NEWS

కంప్లయింట్: అమరావతి మహిళలపై తప్పుడు కేసులు

Satyam NEWS

Leave a Comment