30.7 C
Hyderabad
April 29, 2024 03: 27 AM
Slider నల్గొండ

బలవంతపు రిటైర్మెంట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి

#SheetalRoshapati

భారత ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్ఫూర్తితో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ ఐ సి, బ్యాంకు, రక్షణ బొగ్గు,రైల్వే లను బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు.

అందుకు 26న, జరిగే  సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యోగులు రైతులు ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని  బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ ఈనెల 26న, జరిగే సమ్మెలో సంస్థలో ఎనిమిది ఉద్యోగ సంఘాలు పాల్గొంటున్నాయని, వీటిలో ప్రధాన డిమాండ్ బిఎస్ఎన్ఎల్ 4 జి ని సర్వీసులను వెంటనే ప్రారంభించాలని, ప్రైవేటు కంపెనీలకు బిఎస్ఎన్ఎల్ మధ్య వివక్షత ఉండకూడదని ఒకటో తారీకు జనవరి 2017 నుండి మూడో వేతన సవరణ చేయాలని,  పెన్షన్ డివిజన్ చేయాలని, ప్రభుత్వం ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు నిండక ముందే బలవంతంగా రిటైర్ చేసే భయంకర సర్క్యులర్ లను ఉపసంహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్  ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్ కే నజీర్ బాబా, బిఎస్ఎన్ఎల్ కాంట్రాక్ట్ యూనియన్ డివిజన్ సెక్రెటరీ సిహెచ్ ధనరాజు, పద్మ,ఆదెమ్మ, ఇజ్రాయిల్, రవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప‌శు సంప‌ద‌ను మరింత పెంచుకునే ప్రణాళికలు సిద్ధం చేయాలి

Satyam NEWS

9999 నెంబర్ ప్లేట్కు రూ.9,99,999

Bhavani

Moody’s : భారత్ వృద్ధి అంచనాల తగ్గింపు

Satyam NEWS

Leave a Comment