26.2 C
Hyderabad
November 3, 2024 21: 56 PM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

నిండుకుండల్లా మారిన అన్ని జలాశయాలు

Kondaveeti

జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల- రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన జలాశయాలు. తాజాగా కురుస్తున్న వానలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నిండుకుండల్లా మారిపోయాయి. పదేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తుండటం రైతాంగాన్ని సంతోష పెడుతున్నది. 2009 తర్వాత అంతటి పెద్ద ఎత్తున జలాశయాలకు నీటి నిల్వలు చేరుకోవడం ఇదే మెుదటిసారి. అదే విధంగా ప్రకాశం బ్యారేజి కి భారీగా  వరద  నీరు చేరింది. పులిచింతల తొలి సారి పూర్తి స్థాయి నీటి మట్టంకు చేరుకున్నది. పులిచింతల నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి సముద్రం లోకి  నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ జలాయం గేట్లు అన్నీ ఎత్తేయడంతో అది ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ప్రకాశం బ్యారేజీ మొత్తం 70 గేట్లు ఎత్తడం కూడా పదేళ్లలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యాన్ని చేరుకుంటున్నాయి. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందంటూ సంతోషం వ్యక్తం చేశారు. అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా ప్రకృతి సహకరించడం రైతన్నలకు శుభసూచకమంటూ సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇకపోతే 2009లో ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జలాశయాలు నిండుకున్నాయి. తాజాగా జగన్ పాలనలో జలాశయాలు నిండుకుండను తలపిస్తుండటం విశేషం.

(ఫొటో: నాగార్జున సాగర్ జలాశయం వద్ద నేడు పర్యటించిన పరిస్థితి పరిశీలించిన మెట్రో టివి అధినేత కొండవీటి జయప్రసాద్)

Related posts

బాసరలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

Satyam NEWS

కరోనా పీడితులకు ఆహారం అందిస్తున్న మై వేములవాడ వాట్సాప్ గ్రూపు

Satyam NEWS

ఠారెత్తిస్తున్న కొత్త మోటారు వాహన చట్టం

Satyam NEWS

Leave a Comment