32.7 C
Hyderabad
April 26, 2024 23: 38 PM
Slider విజయనగరం

153 ప్రాంతాల్లో 60 అతి స‌మ‌స్యాత్మ‌క ప్ర‌దేశాలు

#SP VZNM

రాష్ట్ర వ్యాప్తంగా  75 మున్సిపాలిటీలు, 5 కార్పొరేష‌న్ ల‌లో వ‌చ్చే నెల 10  ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ విషయాన్ని  ఈ నెల 15 వ తేదీనే ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ ప్ర‌క‌టించేసారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు తేదీని కూడా ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు అన్ని జిల్లాల ఎస్పీల‌కు సంబంధిత బందోబ‌స్తున‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే ఏర్పాటు చేయాల‌ని డీజీపీ గౌతం స‌వాంగ్ ఆదేశాలు ఇచ్చారు.ఇందుకు సంబంధించి విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ…త‌న సిబ్బందితో మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఏర్పాటుక సంబంధించి స‌మావేశాలు కూడా నిర్వ‌హించ‌డం ప్రారంభించారు.

ఇందులో భాగంగా ఏయే ప్రాంతాలు స‌మ‌స్యాత్మ‌క‌,ఏయే ప్రాంతాలు అతి సున్నిత ప్రాంతాల్లో ఆయా వివ‌రాల‌ను ఎస్పీ రాజ‌కుమారీ మీడియాకు వెల్ల‌డించారు. జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేష‌న్, 4 మున్సిపాలిటీల‌కు సంబంధించి 153 ప్ర‌దేశాల‌ను గుర్తించామ‌ని…అందులో 60 అతి సున్నిత‌మైన ప్ర‌దేశాల‌ని…125 సున్నిత‌మైన‌వ‌ని…ఎస్పీ తెలిపరు. .

విజ‌య‌న‌గ‌రంలో 33,బొబ్బిలి-14,సాలూరు-8,నెల్లిమ‌ర్ల‌-5 ప్రాంతాలు అతి సున్నితమైన ప్రాంతాల‌ని ఎస్పీ తెలిపారు.ఇక ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మూడోద‌శ పంచాయితీ ఎన్నిక‌ల‌కు సంబంధించి 17వేల 46 మందిపై బైండోవ‌ర్ కేసులు పెట్టామ‌ని, క్యూలైన్ల‌లో ఓట‌ర్లు ఉండే విధంగా మ‌హిళా సంర‌క్ష‌క పోలీసులను నియ‌మించామ‌న్నారు.ఈ మీడియా స‌మావేశంలో స్పెష‌ల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాస‌రావు కూడా పాల్గొన్నారు.

Related posts

డ్రగ్స్ పై పోరాటం కొనసాగిస్తాను: పట్టాభి

Satyam NEWS

జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే

Satyam NEWS

క్వశ్చన్ అవర్: బిజెపితో హనీమూన్ పిరియడ్ ముగిసిందా?

Satyam NEWS

Leave a Comment