Slider హైదరాబాద్

రేపు మహారాణా ప్రతాప్ సహకార బ్యాంకు ఎన్నికలు

bank elections

మహారాణా ప్రతాప్ సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్ ఎన్నికలను రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు మాజీ వైస్ చైర్మన్ బి. మోహన్ సింగ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఎన్నికల్లో మహిళలకు ప్రాదాన్యత కల్పిస్తూ సిరియల్ నెం 3 నుండి లత మోహన్(చిహ్నం బ్యాటరీ టార్చ్), రవిరాజ్ పర్సా జనరల్ కేటగిరి సిరియల్ నెం 7(వస్త్రము), జనరల్ విభాగంలో బి. ధన్ రాజ్ సింగ్ (కాట్), లను ఓటు వేసి గెలిపించాలని బ్యాంకు మేనేజ్మెంట్ కు, వాటాదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

తాము గెలిచిన వెంటనే వాటాదారులకు 20 శాతం డివిడెండ్ ఇస్తామని, బ్యాంకు శాఖలు, భవిష్యత్తులో ఏటిఎమ్ లను తెరుస్తామని చెప్పారు. అదే విధంగా దుకాణాలు, మైక్రో ఫైనాన్స్, ఎంఎస్ఎంఇ పథకాలకు రుణాలు ఇప్పిస్తామని అన్నారు. అదే విధంగా వాహనం రుణాలు, విద్యా రుణాలు, మొదలైన రుణాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Related posts

వాడివేడిగా కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ సమావేశం

Satyam NEWS

నామినేటెడ్ పోస్టులపై చంద్రబాబు గుడ్ న్యూస్

Satyam NEWS

కమ్మ వర్గానికి అన్యాయం చేస్తున్న జగన్

mamatha

Leave a Comment

error: Content is protected !!