29.7 C
Hyderabad
April 29, 2024 07: 41 AM
Slider తెలంగాణ

లేఅవుట్ ఆస్తుల ట్రస్టీలా లేక భక్షకులా!

ameenpur lands

అమీన్ పూర్ మండలం నరేంద్ర నగర్ కాలని లేఅవుట్ కు సమాధానం దొరకటం లేదు. కస్టోడియన్స్ అయితే అమీన్ పూర్ మునిసిపాలిటీ అని వేరే చెప్ప నక్కర లేదు. ఇక్కడ కస్టోడియన్ అంటే ఆ స్థలాలను అభివ్రుద్ది చేసే వారనే అనవలసి వస్తుంది. వారినే ప్లానింగ్ కమిటీలని కూడా అంటున్నారు. ట్రస్టీ లంటే ఆస్తులను సంరక్షించే వారని గట్టిగా చెప్పవచ్చు. ఆ ట్రస్టీ వారే ఇంటి దొంగలయితే, లేఅవుట్ భూములే గల్లంతు అయితే ప్రజలు ఆశించే లేఅవుట్ ల ప్రణాళికా బద్ధమైన అభివ్రుద్ది ప్రధాన లక్ష్యం విఫలమయి నట్లే కదా!


ట్రస్టీలే అడ్డు గోడలైతే ఈ నాగరీక ప్రపంచంలో సార్వత్రిక లక్ష్యమైన పట్టణ ప్రణాళికా అభివ్రుద్ది పధకాలు ప్రక్క దారి పట్టినట్లేకదా!ఈ ఆరోగ్యకరమైన లేఅవుట్ నగరాలు, లేఅవుట్ లో తోనే కదా సామాజిక అభివ్రుద్ది ,సాంఘీక,ఆర్ధిక అసమానతలు తగ్గించాలని కదా ప్రభుత్వం భావిస్తుంది.లేకుంటే పాత రాతి యుగం లో ఆది మానవుడు గానే ఉండ వచ్చును,మనకు చరిత్ర ద్వారా తెలిసినట్లు ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం, పాకిస్తాన్లో ఉన్న హరప్పా,మొహంజదారోల లో సింథు నాగరికత మొదలుకుని, బ్రిటిష్ కాలం నాటి 1920 పట్టణ ప్రణాళికా పధక చట్టం, 1957 సం”ము లో డిల్లీ డెవలప్మెంట్ అథారిటి, ఈ పట్టణ ప్రణాళికా పథకాలు గురించే 1992 సం”ములలో మన భారత 74 రాజ్యాంగ సవరణలు ద్వారా 11,12 షెడ్యూల్ లలోపట్టణ ప్రణాళికా పథకం చట్టాలు ఆమోదించి భారత దేశం స్థానిక సంస్థలలో లేఅవుట్ ల నిబంధ‌నలు పాటించి సమగ్ర పట్టణాభివృద్ధి ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.

ఇలాంటి ఉన్నతాశయాలను ట్రస్టీ లు కాలరాయ వచ్చునా? కంచే చేను మేసినట్లు లేఅవుట్ పార్క్ స్థలాలన్నింటిని లేఅవుట్ యజమానులు లేదా హౌసింగ్ కమిటీలు స్వాహా చేయవచ్చునా? ఈ కథ పూర్వా పరాలు అన్ని తెలిసి కూడా చెవిటి, గ్రుడ్డి వాళ్ళ లాగా ప్రవర్తిస్తారా? లేఅవుట్ లో, డి – బ్లాకులో సాంబి చెరువు ఎఫ్.టి.ఎల్- స్థలంలో తరచూ కొంతమంది భౌతికంగా ఆక్రమణలు చేస్తున్నా, వివరాలన్ని తెలిసినా కేవలం ఆక్రమణలను మాత్రమే తొలగించి, చట్ట ప్రకారం ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసి కొన కుండా మున్సిపాలిటీ అధికారులు ఎందుకు వదిలేస్తున్నారు. కనీసం ఆక్రమణలు తొలగింపు ఖర్చులు కూడా ఆక్రమణలు దారులు వద్ద ఎందుకు వసూలు చేయుటం లేదు. అధికారులు వారిపై అంత సానుభూతి ఎందుకు చూపిస్తున్నారో వారికే తెలియాలి. పైగా ఈ ఎఫ్.టి.ఎల్-స్థలం లోనే పార్క్ స్థలం అని సూచించే హెచ్చరిక బోర్డులను మున్సిపాలిటీ అథికారులు ఇక్కడనే స్థాపింప చేస్తున్నారు.


ఇలాంటి ప్రజల కంటి తుడుపు చర్యలు ప్రదర్శించి ప్రజలను అథికారులు మోసగించ వచ్చునా? ఎవరో తప్పుదారి పట్టించి గౌరవ లోకాయుక్త వారి ఆద్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కాశీనాదం సర్వే చేయిస్తే లేఅవుట్ భూమి స్వభావం మారి పోతుందా? అధికారుల, లేఅవుటు యాజమాన్యం మరి కొన్ని లేఅవుట్ అక్రమాలు ద్రుష్టి కి తీసుకొని రాక తప్పదు. 1996 సం”ము లేఅవుట్ ప‌రిధి లోను, ఆ తర్వాత కూడా లేఅవుట్ డ్రాఫ్ట్ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీఅధికారులకు తెలియకుండా జరిగాయని చెప్పటానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడున్న లేఅవుట్ అసలు ఎన్నో లేఅవుటో అథికారులు కె తెలియాలి. ఇది రిన్యూవల్ లేఅవుట్ అట.

ఈ రెన్యూవల్ ఎన్ని సంవతసరాల కొకసారి చేస్తారో అథికారులే సెలవివ్వాలి. లేఅవవుట్ లో ప్రవేశిక, నిష్క్రమణ రోడ్లు చూపించకుండానే లేఅవుట్ ఆమోదిస్తారేమో లేఅవుట్ ను ఆమోదించిన వారే చెప్పాలి. లేఅవుట్ డ్రాఫ్టు సూచికలోని అంశాలు అంటే లేఅవుట్ స్థలాలు విస్తీర్ణం, గ్రుహాల ప్లాట్లకు కేటాయించిన స్థలం, ఎమినిటీస్, పార్క్ స్థలాలు, రోడ్లు, డ్రైనేజికి కేటాయించిన స్థలాలు డాక్యుమెంట్లు, అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండానే లేఅవుట్ ఆమోదిస్తారా? లేఅవుట్ యాజమాన్యాలు గవర్నమెంట్ పన్నులు బకాయి ఉన్నా లేఅవుట్ ను అనుమతిస్తారా?


మచ్చుకు లేఅవుట్ లో 52ఎక-11.1/2 గుం”లో స్థలం చూపితే క్షేత్ర స్థాయిలో లేఅవుట్ ఆమోదించే రోజుకు 37 ఎకరాలు మాత్రమే ఉన్నది. 55 సర్వే.నం”లో ఉండాల్సిన పార్క్ స్థలం ప్రక్కనే ఉన్న జన చైత‌న్య వెంచర్ 53 సర్వే.నం.-లోనికి బదిలీ అయిపోయింది. ఎవరి స్థలాన్నోఎలా ఈ లేఅవుట్ లో పార్క్ స్థలంగా చూపిస్తారు. అయినా 53 సర్వే నంబరులో రీ సర్వే జరిగి ఉంటే అప్పటి గ్రామ పంచాయతీకి తెలియకుండానే సర్వే చేస్తారా?


1128 సర్వే.నం.-లో పార్కు కు స్థలమే మిగల్చలేదు. అందులోని పార్క్ స్థలాన్ని సాంబి చెరువు ఎఫ్.టి.ఎల్.-లో ఎలా చూపిస్తారు. ఇక్కడ పంచనామా జరిపించి రీ సర్వే చేయించాల్సిన అవసరముంది. అప్పటిదాకా అధికారులకు నిజం అవగతం కాదు.


64 సర్వే.నం.-లో పార్కు స్థలాన్ని ప్లాట్లు గా చేసి1340 చ.గ “లను అమ్మేశారు. డాక్యు.నం.25336/2006 లో ఈ విక్రయం జరిగింది. 85 సర్వే.నం”స్వతహాగానే లేఅవుట్ ప్రకారం ఇండ్ల ప్లాట్లు స్థలం. దీనిని డాక్యుమెంట్ లో 25339/2006లో కొన్న వారు అధికారుల అనుమతులు తీసుకొనకుండా ఇక్కడ రెలిజియస్ శివాలయం నిర్మించారు. కాని ఈ స్థలాన్నిపార్కు స్థలంగా లోకాయుక్త గుర్తించింది. 93 సర్వే నంబరు ఏ-బ్లాకులో పార్క్ స్థలంనకు సబ్ డివిజన్ కూడా జరుగలేదు. కాని లోకాయుక్త ఇక్కడ 16 గుంటలు స్థలం ఉందని తీర్పు చెప్పింది. స్కెచ్ డ్రాయింగ్ కూడా అందజేసింది. కాని దానికి మున్సిపాలిటీ అధికారులు కొలతలు చేయించి హద్దులు నిర్థారించకుండా, ఏదో థర్మానికా అన్నట్లు కొద్దిగా స్థలం ప్రదర్శనగా పెట్టి, దానిని పార్క్ గా అభివ్రుద్ది చేసి ప్రజలకు అంకితం చేయలేదు. ఆ కాస్త స్థలాన్నికూడా ఎవరైనా ఎప్పుడైనా ఆక్రమణ చేయవచ్చు. ఈ పార్కు స్థలాలు వేటికి మునిసిపాలిటీ గిఫ్టు డీడులు లేఅవుట్ ట్రస్టీ నుండి లేదా అసలు లేఅవుట్ యజమాని నుండి మున్సిపాలిటీ అథికారులు సరెండర్ చేసు కోలేదు.

అయినా అధికారులు ఆ పనికి వెనుకాడుతూ ముందుకెళ్ళ టం లేదు. 2019 సం”ము లో స్పష్టంగా హైకోర్టు లేఅవుట్ ప్రకారం 2ఎక-03 గుం”లు పార్క్ స్థలాలు స్వాధీనం చేసుకోమని తీర్పు వెలువరించినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్య‌వ‌హ‌రించారు. ఇది ఇలా ఉంటే లేఅవుట్ లో ఇంకా ఇతర భాగస్వాములు మధ్యంతరంగా వచ్చి 03ఎక-14గుం”లు లేఅవుట్ లో చేర్చినా లేఅవుట్ సూచిక లోని 52ఎక-11.1/2 గుం”లకు బదులు 40ఎక-14గుం”ల విస్తీర్ణానికి మాత్రమే చేరుకో కలిగింది. ఈ లేఅవుట్ లో మొత్తం 25 సర్వే నెంబర్లు ఉంటే లేఅవుట్ ఆమోదం నాటికి 22 సర్వే నెంబర్ల భూములే క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉన్నవి. 2003 లో సం”ము లో 1128 సర్వే నంబరు తాలూకు 1ఎక-14 గుం”లో స్థలం క్రొత్తగా లేఅవుట్ లో చేరింది. అలాగే 2006 సం”ము లో39 సర్వే నంబరు లో 21.1/2 గుం”ల స్థలం లేఅవుట్ లో చేరింది. 2012 సం”ము లో54 సర్వే నంబరు లో 1ఎక-19గుం”ల స్థలం లేఅవుట్ లో చేరింది.

అప్పటికి లేఅవుట్ స్థలం మొత్తం 40ఎక-14 .1/4గుం”ల స్థలానికి మాత్రమే చేరుకుంది. కొత్తగా వచ్చి కలసిన సర్వే నెంబర్ల భాగస్వాములు ప్లాట్లు సొంతగా అభివ్రుద్ది చేసుకొని, విక్రయం చేసుకొని రిజిస్ట్రేషన్ లు కూడా చేయించి, గ్రామ పంచాయతీ వద్ద ఇండ్ల నిర్మాణం అనుమతులు కూడా తీసుకొని, వాటికి డోరు నంబర్లు కూడా తెచ్చుకున్నారు. పంటపొలాల్లోరెండు లేదా మూడు పంటలు పండించే లాగా, లేఅవుట్ లో క్రొత్త సర్వే నంబరు జాయిన్ అయినప్పుడల్లా క్రాపులు, క్రాపులు గా లేఅవట్ విస్తీర్ణం పెంచుకుంటూ, ప్లాట్లు చేసి రిజిస్ట్రేషన్ లు చేసుకుంటూ లేఅవుట్ ను కంచుకోట లాగా వాడుకున్నారు. ఇదే లేఅవుట్ లోఇతరుల స్థలం 1128/పి,లో లేఅవుట్ యాజమాన్యం కొంత ఆక్రమణ చేసి ఇళ్ళు ప్లాట్లు కూడా చేసి వాటికి తన సొంత 1128 సర్వే నంబరు ఇచ్చి ప్లాట్లు 376/7, 336/10, 375/8, 375/6 ను అమ్ముకున్నాడు.


వీటికితోడు ఈ 1128 సర్వే నంబరు యజమాని ప్రక్కన ఇతరుల 1128/పి లో కామన్ సెప్టిక్ ట్యాంకు నిర్మించాడు. 2013 సం”ము లో 1128/పి స్థలం యజమాని వచ్చి ఆ సెప్టిక్ ప్రక్కనే ఉన్న పి.వి.ఎన్.ఆర్.-వెంచరు వారికి అమ్మేశారు. మొదట్లో లేఅవుట్ భాగం స్వాములు కాని వారి 54 సర్వే నంబర్ లో లేఅవుట్ యాజమాన్యం ప్రారంభంలోనే వారి నాలుగు ప్లాట్ల స్థలం ఆక్రమించి వాటికి బదులుగా హెచ్.ఎ.ఇ.హెచ్.సి -అధినంలో ఉన్న మోడల్ హౌస్ 40/14,40/15 ప్లాట్లు 400 చ.గ”లు స్థలం ను అమ్మేసి, ఆ డబ్బును 54 సర్వే నంబరు వారికి సెటిల్మెంట్ గా అందచేసి మోడల్ హౌస్ లేకుండా చేశారు. డాక్యు. 12780/2011లో మోడల్ హౌస్ ను అమ్మేశారు.


93 సర్వే నంబరు స్థలం యజమాని, కొంత 91 సర్వే.నం”లో స్థలంను 150 నుండి154 ప్లాటు నెంబర్లతో ప్రక్కనే ఉన్న ఎ- బ్లాకులో నివాసేతర అవసరాలకు అమ్మేశారు.87 సర్వే నంబరు159 నుండి167 ప్లాటు వరకు 9 ప్లాట్లను డాక్యూ25335/2006 లో లేఅవుట్ నుండి వెనకకు వ్యవసాయ భూమిగా అమ్మేశారు. లేఅవుట్ లోని అధిక సర్వే నంబర్లలో80%శాతం పైగా ఇండ్ల ప్లాట్లు ఉండేటట్లు నిబంద‌నలకు వ్యతిరేకంగా ప్లాంటింగ్ చేశారు. నిబంధనల ప్రకారం ఇళ్ల‌ కేటాయింపులకు లేఅవుట్ లో ప్లాట్లు 60 శాతం మించ రాదు. విచిత్రం ఏమంటే 91, 55, 87, 39, 93 సర్వే నెంబర్ల లో లేఅవుట్ యజమానులకున్నఅసలు స్థలం విస్తీర్ణం కన్నాఅతి ఎక్కువ విస్తీర్ణాలను రిజిస్ట్రేషన్ చేశారు. దీనికంతటికి కారణం ప్రక్క భాగ స్వాములు స్థలాలను ఆక్రమించటం, లేఅవుట్ గ్రామ సరి హద్దులో గ్రామ కంఠముల ఆక్రమణలు వగైరా బాగా కలిసి వచ్చింది అని భావించవచ్చు.

పోతే లేఅవుట్ లో దేవాలయములు ఆక్రమణలు-61 సర్వే.నం.”లో రామాలయం, 85 సర్వే నంబరు లోని 263, 264, 265, 266 ప్లాట్ల లో శివాలయం అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగింది. 2012లో లేఅవుట్ లోని పార్క్ స్థలాలు లోకాయుక్త ఆధ్వ‌ర్యంలో లోపటాన్ చెరు మండల సర్వేయర్ రీ సర్వే జరిపిన విషయం లోకాయుక్త, గ్రామ పంచాయతీ వారు ద్రువీకరిస్తూ ఉంటే పటాన్ చెరు తహశీల్దార్ వారి మండల కార్యాలయంలో అలాంటి ఆధారాలు ఏమి లేవని లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మండల సర్వేయర్ మాత్రం ఆయన సర్వే స్కెచ్ పేపర్లు లోకాయుక్తకు పంపించారు. మండల సర్వేయర్ ఇచ్చిన నివేదికలో 1ఎక-38గుం”లు పార్క్ స్థలాలు లేఅవుట్ లో ఉన్నాయని తెలిపారు. సరే, ఎవరేం చెప్పినా, ఈ సర్వే 2012సం”ములో జరిగింది.

అంతకు ముందే, నిజానికి ఆ స్థలాలు 2003, 2006 సం”ము లోనే ఆ పార్కు స్థలాలను హెచ్.ఎ.ఇ.హెచ్.సి -వారికి అమ్మి వేయ బడినవి. అయితే ఇక్కడ లోకాయుక్త వారిని అధికారులు బురిడి కొట్టించారు అనే మాట వాస్తవం. లేఅవుట్ యాజమాన్యం, పార్కు స్థలాలు గిఫ్టు డీడులు మున్సిపాలిటీ కి అంద చేయకుండా లేఅవుట్ యాజమాన్యం మోసాలు, అధికారులు మోసాలు, అధికారులకు వత్తాసు పలికే కొంతమంది ఉన్నతాధికారులు ఉన్నంత కాలం లేఅవుట్ లక్ష్యాలకు తూట్లు పొడుస్తూనే ఉంటారు గనుక ఈ సమస్య‌ను డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్కు, చీఫ్ ఇన్కమ్ టేక్స్ కమీషనర్ కి, పోలీసు వారికి పంపి, వారి నివేదికలు వచ్చాక హైకర్టు కంటెమ్ట్ కేసుగా దాఖలు చేస్తే తప్ప వేరే మార్గము కనిపించ‌డం లేదు. ఇప్పటికైనా అధికారులలో చలనం వస్తుందా?

Related posts

ఖమ్మంలో సూపర్‌ స్ప్రెడర్లకు వాక్సినేషన్ కార్యక్రమం

Satyam NEWS

New Challenge: మంకీపాక్స్ అంటే?

Satyam NEWS

విక్రమ్ ల్యాండర్ జాడను ఇస్రో ముందే కనిపెట్టింది

Satyam NEWS

Leave a Comment