40.2 C
Hyderabad
April 26, 2024 14: 43 PM
Slider ఖమ్మం

ఖమ్మంలో సూపర్‌ స్ప్రెడర్లకు వాక్సినేషన్ కార్యక్రమం

#minister puvvada

సూపర్‌ స్ప్రెడర్లకు వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఖమ్మం నగరంలోనే శాంతినగర్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ తీరును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు పరిశీలించారు. అర్హులైన అందరికి  వ్యాక్సినేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

వ్యాక్సినేషన్ కోసం అదనపు సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రతి కేంద్రంలో వ్యాక్సినేషన్ రూం, వెయింటింగ్ రూం, అబ్జర్వేషన్ రూం లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఎక్కడ ఇబ్బంది కలుగకుండా చూడాలని ఎప్పటికప్పుడు కోవిడ్ కేంద్రాల వివరాలు సేకరించాలని జిల్లా వైద్యాధికారి మాలతి కి సూచించారు. మంత్రి వెంట మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ విజయ్, DM&HO మాలతి, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మందడపు మనోహర్, మాక్బూల్ వైద్య సిబ్బంది ఉన్నారు.

Related posts

గ్రేట్: స్ప్రే యంత్రం రూపొందించిన నాగర్ కర్నూల్ ఎస్ పి

Satyam NEWS

అక్టోబరు 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర

Satyam NEWS

వేతనాల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

Satyam NEWS

Leave a Comment