27.7 C
Hyderabad
April 26, 2024 06: 59 AM
Slider ప్రత్యేకం

మోదీ…. పవను భేటీ… మధ్యలో ఫ్యాను ‘‘గాలి’’

#jagan

‘‘ఒక్క అవకాశం’’ అని గత ఎన్నికల్లో ఒక స్లోగన్ ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ సాధించిన వైసీపీ వచ్చే ఎన్నికలకు మరో స్లోగన్ రూపొందించుకుంది. అదే “మళ్ళీ వైసీపీనే” ఇప్పుడు ఇదే మాట రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేలా పార్టీ వ్యూహం రచిస్తుంది. ఈ సిద్ధాంతానికి నాంది విశాఖలో జరిగిన ప్రధాని మోడీ సభనే సాకుగా వైసిపి చూపిస్తుంది. అసలు ఏమి జరిగింది.. మళ్ళీ వైసీపీనే స్లోగన్ ని ఎవరు సృష్టించారు..ఇప్పుడు చూద్దాం.

ప్రధాని విశాఖ పర్యటన ఖరారు కాగానే వైసీపీ వ్యూహాన్ని బయటికి తీసింది. ప్రధాని సభ ఏర్పాట్లు బీజేపీ తన భుజాలపై మోయాలి .. కానీ వైసిపి తెలివిగా ఇది రాజకీయ సభ కాదు .. అభివృద్ధి సభ అంటూ బీజేపీ నేతలనే పక్కకు జరిపారు. పైగా దేశ ప్రధాని పర్యటనను రాజకీయం చేయవద్దు అని ముఖ్య నాయకులతో ప్రెస్ మీట్ లు పెట్టి మరి చెప్పించారు. ఓ అదికూడా నిజమే కదా అని స్థానిక బీజేపీ నాయకులూ కూడా ఇది మనకు కలిసి వచ్చే అంశమే, పైగా జనసమీకరణ కూడా మన పై పడదులే.. పడిన అప్పుడు చూద్దాంలే అని బీజేపీ నాయకులు బాధ్యత నుంచి తప్పించుకున్నారు.

దీన్ని క్యాష్ చేసుకున్న వైసిపి విశాఖ గర్జన లా తుస్ మనిపించకుండా, వైసిపి ప్రధాన నాయకుల నుండి కార్పొరేటర్లు వరకూ జన సమీకరణ చెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రధాని సభను సక్సెస్ చేసి ఒక్కదెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని ప్లాన్ చేసుకున్నారు. ప్రధాని సభను సక్సెస్ చేయడం ద్వారా విశాఖ రాజధాని అనే అంశంతో బాటు, బీజేపీ తమ వైపే ఉందని చెప్పడం, ఈ రెండింటితో బాటు మళ్ళీ వైసీపీనే అనే స్లోగన్ లు ప్రజల్లోకి తీసుకెళ్లి లా ప్రణాళికను పక్క గా అమలు చేశారు.

సరిగ్గా ఇక్కడే చిన్న చిక్కు వచ్చిపడింది వైసిపి కి .. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంతా హంగామా చేస్తుంటే .. జనసేన అధ్యక్షుడుకి ప్రధాని నుండి పిలుపు రావడం, పవన్ కళ్యాణ్ ఫ్లయిట్ ఎక్కి వాలిపోవడం జరిగింది.. ఇక్కడ కథలో ట్విస్ట్ .. పవన్ కళ్యాణ్ , ప్రధాని మోడీ భేటీ 30 నిముషాలు పాటు జరిగింది. బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ 2 నిముషాల్లో లోపలే ఏమి జరిగిందో వివరించారు.

అనంతరం సభ జరిగింది. ఇక్కడ వైసిపి కొత్త అస్త్రం తీసింది. జగన్ ప్రసంగం ఎలా ఉంటుందా అని ఆసక్తిగా గమనించారు జనం. సీఎం జగన్ వంగపండు .. శ్రీశ్రీ మాటలను గుర్తు చేస్తూ .. ప్రధానికి అర్ధం కాకుండా ఆంధ్ర ప్రజలకు అర్ధం అయ్యేలా .. ఆంధ్రుల సాక్షిగా అడగాల్సినవి అన్ని అడిగేశారు. చివరగా మీ ఆశీస్సులు కావాలన్నారు.. జగన్ ఏమి మాట్లాడుతున్నారో అర్ధంకాని మోడీ.. చూస్తూ ఆలా ఉండిపోయారు..

ఈ లోపు జగన్ సాధించాల్సిన పనిలో 40 శాతం పూర్తి చేసేశారు. చూశారుగా మోడీ ఎదురుగానే దుమ్ము దులిపేశారు సీఎం గారు .. కడిగేశారు .. ఇక వాళ్ళ చేతుల్లోనే ఉంది అంతా అనే విధంగా వైసీపీ సోషల్ మీడియా ప్రచారం మొదలు పెట్టేసింది. ప్రధాని మోదీ ఏపీ కి ఎటువంటి హామీ లు .. వరాలు గురిపించలేదు.. ఇదే ఆశించిన జగన్ .. కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్న చందంగా .. బీజేపీ ని ప్రజల ముందు బూచిగా చూపి.. ప్రధాని సభను తామే సక్సెస్ చేశాము అనే మౌత్ టాక్ ని బయటకు వదిలారు..

దీనికి తోడు స్థానిక బీజేపీ నేతలు కూడా సభ సక్సెస్  విషయంలో వైసిపి ని మెచ్చకున్నారు. అసలు కథ ఇక్కడ స్టార్ట్ చేశారు.. పవన్ కళ్యాణ్ .. మోడీ మధ్య ఏమి సంభాషణ జరిగిందో .. వైసిపి తన వెర్షన్లో తమ సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేసేలా ఓ కథని వదిలారు .. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలా ఉన్నారు.. బాగున్నా సర్.. మీరు బాగున్నా .. మనం కలిసి 8 ఏళ్ళు అయ్యింది అనుకుంటా. అవును సర్.. ఎలా ఉంది పరిస్థితి అని పవన్ ని అడిగితే రాష్ట్ర పరిస్థితులు గురించి పవన్ మోడీకి వివరించారు అని.. నాకు అన్ని తెలుసునని బదులు ఇచ్చారు…

అప్పుడు పవన్ .. మీరు .. నేను .. చంద్రబాబు కలిసి వెళ్తే అధికారంలోకి వస్తాం అని సెలవిస్తే.. మోడీ నవ్వి .. ఎంతకాలం ఒక పార్టీ క్రింద మనం ఉంటాం .. మన శక్తి మనకు తెలుసు .. మనం కలిసి పనిచేద్దాం .. టీడీపీ కలపొద్దు అని అన్నారు. పైగా జగన్ పాలన బాగుంది మాకు అన్ని తెలుసు .. మిమ్మల్ని మేము చూసుకుంటాం అని కూడా అన్నారుట. చేసేది ఏమిలేక పవన్ నమస్కారం పెట్టి చిరు నవ్వి బయటకు వచ్చేశారట.. వండి వార్చిన కథను బయటికి స్ప్రెడ్ చేశారు.. జగన్ పాలన పై మోడీ కితాబు ఇచ్చారు అని ..

జగన్ జోలికి వెళ్లడం వెస్ట్ .. మన పని మనం చేద్దాం .. అని మోడీ పవన్ కి గీతాబోధ చేశారు అంటా కథ బయటకు వచ్చేసింది. అందుకే పవన్ రిషికొండ పరిశీలనకు వెళ్లిన అక్కడ పెద్దగా మాట్లాడలేదు అని .. విజయనగరం లో కూడా ప్రభుత్వం మీద పెద్దగా ఏమి మాట్లాడాడలేదని .. మోడీ హితబోధ పనిచేసింది అని వైసిపి సోషల్ మీడియా విపరీతంగా స్ప్రెడ్ చేస్తుంది. పైగా పవన్ తలపెట్టిన జగన్ అన్న ఇళ్ల పరిశీలన కార్యక్రమం ద్వారా వైసిపి కే పబ్లిసిటీ తీసుకొచ్చింది అని ఈ ముడేళ్ళల్లో రాని పేరు పవన్ పుణ్యమా అని మూడు రోజుల్లోనే వచ్చిందని వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు.

ఇక దీనితో చంద్రబాబు డైలమాలో పడిపోయారని .. తమ దూత ద్వారా వర్తమానం ప్రధాని వద్ద ఫలించలేదని .. మరో వార్త స్ప్రెడ్ చేస్తున్నారు.. ప్రధాని సభ లో జగన్ ఆత్మస్తైర్యం తో కనిపించారని .. అదే గెలుపు సంకేతం అని.. కేంద్రం నుండి పెద్ద హామీ పొందితే తప్ప .. అంతలా మోడీ ముందు మాట్లాడలేరని .. బీజేపీ కి చెప్పే జగన్ అలా చేశారని.. జగన్ కు మోడీ ఆశీర్వాదం ఉందని.. ఇక తమను ఎవరు ఆపలేరని .. మళ్లీ వైసీపీనే అని.. వాళ్లకు వాళ్లే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

రామకృష్ణ పూడి, ప్రత్యేక ప్రతినిధి, విశాఖపట్నం

Related posts

Good News: అన్నా చెల్లెళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు

Satyam NEWS

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు

Satyam NEWS

‘టాప్ గేర్’ సినిమా టెక్నికల్‌గా అద్భుతం..

Satyam NEWS

Leave a Comment