27.7 C
Hyderabad
April 26, 2024 06: 35 AM
Slider కవి ప్రపంచం

దివ్య దీపోత్సవం!

#J Shayamala New

అమావాస్య చీకట్లను చీలుస్తూ

దీపావళి దివ్వెల వెలుగులు

‘ తమసోమా జ్యోతిర్గమయ ‘

కానీ..

చీకటి నుంచి వెలుగుకు నడిపేది

ఈ ప్రమిదల వెలుగులేనా?

ఈ కొవ్వొత్తి దీప కాంతులేనా?

ఈ విద్యుద్దీపాల తోరణాలేనా?

ఒక్కసారి ..ఒక్కటంటే ఒక్కసారి

నిజాయితీగా నీలోకి తొంగి చూడు

మనసంతా చీకటిమయం

హద్దెరుగని అహంభావం

అంతులేని అసూయ

స్వార్థం.. సంకుచితత్వం

వైషమ్యం.. విద్వేషం.. పైశాచికత్వం

వెరసి అక్కడంతా చిక్కబడ్డ చీకటేగా

నీకు తెలుసా?

బయటి చీకట్ల కన్నా

లోని చీకట్లే  పెను ప్రమాదం

అందుకే.. ముందు నీలోని చీకట్లను                   

మానవతా దీప్తులతో చీల్చు

నీవే ఒక వెలుగై భాసించు

అదికదా దివ్య దీపోత్సవం!

అదేకదా భవ్య దీపావళి!!

జె. శ్యామల

Related posts

పిసిసి అధ్యక్షుడు రేవంత్ పై సీనియర్ల అసత్య ప్రచారం

Satyam NEWS

వైట్ హౌస్ దగ్గర కాల్పుల్లో ఒకరి మృతి

Satyam NEWS

పదవీ విరమణ చేసిన హెంగార్డుకు ‘చేయూత’

Satyam NEWS

3 comments

Gannavarapu Narasimha Murty November 4, 2021 at 5:09 PM

మనస్సు లోని చీకటి గురించి చాలా బాగా వ్రాసి తిమిరంతో సమరం చేసేరు.అభినందనలు

Reply
Mramalakshmi November 5, 2021 at 10:28 AM

Inspirational message very nice madam??

Reply
Satyam NEWS November 6, 2021 at 4:46 PM

Thank you

Reply

Leave a Comment