Slider కృష్ణ

ఇద్దరు స్వాముల మధ్య యాగం ‘‘పూర్ణాహుతి’’

#visakhasaradapeetham

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో విజయవాడలో నిర్వహిస్తున్న అష్టోత్తర శత(108) కుండాత్మక చండి,రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం ఇద్దరు స్వాముల సిగపట్లకు వేదిక అయింది. వైసీపీ అధికారంలోకి రాక ముందు నుంచి ‘‘రాజగురువు’’ గా పేరు పొందిన విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రమేయం లేకుండానే ఈ యాగానికి శ్రీకారం చుట్టారు.

ప్రతిరోజు చతురాగమ యాగశాలలో 108 కుండములలో హోమం, అర్చనలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రధాన యాగశాలలో అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ట 108 కుండములలో అగ్నిస్థాపన హోమాలు జరుగుతున్నాయి. తమిళనాడు నుండి వచ్చిన రుత్విక్కులతో వారి ఆచారం మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  550 మందికి పైగా రుత్వికులు, వారికి సహాయంగా 300 మంది యజ్ఞ యాగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

32 మంది సన్నాయి, డోలు వాయిద్య కళాకారులు శాస్రోక్తంగా యాగశాలకు అనుసంధానం చేస్తూ వారి సహకారం అందిస్తున్నారు. మైసూరు దత్తపీఠం అధిపతి గణపతి సచ్చిదానంద ఆధీనంలో చివరి రోజు పూర్ణాహుతి జరుగుతుందని ముందుగా నిర్వాహకులు వెల్లడించారు. అందుకోసం ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు. అయితే చివరి రోజు పూర్ణాహుతి సందర్భంగా ‘‘రాజగురువు’’ గా పేరు పొందిన విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి రంగ ప్రవేశం చేశారు.

ఇటీవల సింహాచలంలో జరిగిన అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లు ఘోరంగా ఉన్నాయని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసి స్వరూపానంద వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. స్వరూపానంద ప్రభుత్వాన్ని విమర్శించడంతో ఒక్క సారిగా రాష్ట్ర మొత్తం ఆ వార్త దావానలం లాగా వ్యాపించింది. దాంతో ముఖ్యమంత్రి కార్యాలయం రంగ ప్రవేశం చేసి స్వరూపానంద ను మందలించింది.

దాంతో స్వరూపానందేంద్ర స్వామి క్షమాపణలు చెప్పారు. తాను ప్రభుత్వాన్ని విమర్శించలేదని వివరణ ఇచ్చుకున్నారు. అష్టోత్తర శత(108) కుండాత్మక చండి,రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యాగానికి తనను పిలవకపోవడం, తన ప్రమేయం లేకుండా యాగానికి ప్రణాళిక సిద్ధం చేయడంపై స్వరూపానంద తీవ్రమైన మనస్తాపానికి గురయ్యి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

యాగం ప్రారంభం అయి నేడు చివరి దశకు రావడంతో ఎలాగైనా తన పూర్వ వైభవం దక్కించుకోవాలనుకున్న స్వరూపానంద ముఖ్యమంత్రి కార్యాలయంతో కథ నడిపారని చెప్పుకుంటున్నారు. దాంతో ఆయనకు మళ్లీ పూర్ణాహుతి రోజు యాగంలోకి ప్రవేశం లభించింది. స్వరూపానంద ఆయన ఉత్తరాధికారి ప్రవేశంతో గణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో జరగాల్సిన పూర్ణాహుతి వారి చేతుల్లోకి వెళ్లి పోయింది. దాంతో ఆయన కినుక వహించారని అంటున్నారు.

గణపతి సచ్చిదానంద స్వామికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. అలాంటి ఆయనను తీసుకువచ్చి చివరి రోజు ఇలా అవమానించడంపై ఆయన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వరూపానంద ఆఖరు నిమిషంలో చక్రం తిప్పి మళ్లీ రంగ ప్రవేశం చేస్తారని చాలా మంది ఊహించలేదు. ‘‘రాజగురువు’’ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు కానీ ఆయన మళ్లీ తన పాత పదవిని చేపట్టినట్లే కనిపిస్తున్నదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Related posts

కొత్తూరులో హైటెక్ వ్యభిచారం..?

Satyam NEWS

విక్టరీ: మంత్రి ఎర్రబెల్లికి అభినందనల వెల్లువ

Satyam NEWS

ఓ రైతు, పాస్ బుక్ సమస్య, ఒక పెట్రోలు బాటిల్

Satyam NEWS

Leave a Comment