హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్నది ఒక వోల్వో బస్సు. అందులో ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూడా ప్రయాణిస్తున్నారు. అదే బస్సులో ఉన్న రిలీవింగ్ డ్రైవర్ నూర్ మహ్మద్ వికృతంగా చూస్తూ ఆమె పట్ల వికృతంగా ప్రవర్తించాడు. అంతే ఆ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 100 నెంబర్ కు ఫోన్ చేసింది.
వెంటనే స్పందించిన పోలీసులు అనంతపురం తపోవనంలో బస్సు ఆపారు. నాలుగో టౌన్ పోలీసులు బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకొని జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డ్రైవర్ నూర్ మహ్మద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ మహిళను అదే బస్సులో బెంగళూరుకు పంపించారు.
పోలీస్ స్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా మహిళ ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా పోలీసులు తొలి సారిగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను వేధిస్తున్న డ్రైవర్‌ను తక్షణమే అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడంపై బస్సులోని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.