30.7 C
Hyderabad
April 29, 2024 06: 59 AM
Slider ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి పుష్కరిణి లో స్నానం చేయడం కుదరదు

Swamy-Pushkarini-11Dec-copy

మరమ్మతు పనుల నిమిత్తం తిరుమల శ్రీవారి పుష్కరిణిని మూసివేశారు. పుష్కరిణికి అన్ని వైపులా ఉన్న గేట్లకు అధికారులు తాళాలు వేశారు. ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు ఆగస్టులో పుష్కరిణిని మూసివేసి కోనేరులోని నీటిని మార్చడం ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది నీటి ఎద్దడి కారణంగా పుష్కరిణి శుభ్రత పనులను వాయిదా వేశారు. తాజాగా, ఈ ప్రక్రియను టీటీడీ అధికారులు ప్రారంభించారు. నిల్వ ఉన్న మురుగునీటిని పైపుల ద్వారా నీటిశుద్ధి కేంద్రాలకు తరలించారు. నెల రోజులపాటు పుష్కరిణి శుద్ధి పనులు కొనసాగనున్నాయి. పుష్కరిణి అడుగుభాగం, మెట్లను పూర్తిగా శుభ్రం చేస్తారు. పాచి, చెత్తాచెదారాన్ని తొలగించి రంగులు వేస్తారు. అనంతరం 23 లక్షల గ్యాలెన్ల నీటితో పుష్కరిణిని నింపుతారు. ఈ పనులన్నీ పూర్తయిన అనంతరం వచ్చే నెల 6న పుష్కరిణిని పునఃప్రారంభిస్తారు. ఈ పనుల కారణంగా సాయంత్రం ఊరేగింపు సమయంలో ఉత్సవర్లకు సమర్పించే పుష్కరిణి హారతిని కూడా రద్దు చేశారు. పుష్కరిణి మరమ్మతులు పూర్తయ్యే వరకు భక్తులు స్నానపు గదుల్లోనే స్నానమాచరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

Related posts

ఆర్టీసీ బస్సుల్ని అడ్డుకుంటే క్రిమినల్ కేసులు

Satyam NEWS

8న తిరుమలలో అన్నమయ్య సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం

Satyam NEWS

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment