28.7 C
Hyderabad
April 27, 2024 04: 12 AM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

ఆంధ్రా బ్యాంకు కు తీరని అన్యాయం

DvyuxXFUUAAmO61

తెలుగు వారి కీర్తి ప్రతిష్టలకు ప్రతీక అయిన ఆంధ్రా బ్యాంకు ను యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా వుందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. స్వాతంత్ర్యం రాక మునుపు 90 ఏళ్ల కిందటే ఏపి కి చెందిన పట్టాభిరామయ్య ఆంధ్రాబ్యాంకును స్థాపించారని, ఎంతో ప్రత్యేకత ఉన్న ఆంధ్రా బ్యాంకు ను వేరే బ్యాంకులతో కలపొద్దని ఆయన కోరారు. తెలుగు ప్రజల మనోభావాలను అద్దం పట్టే ఈ సునిశితమైన అంశం పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పునరాలోచించుకోవాలని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖలో కోరారు. ఒక వేళ తప్పనిసరి పరిస్థితులలో విలీనం చేయాల్సి వస్తే విలీనమైన బ్యాంకు కు ఆంధ్రా బ్యాంకు గానే నామకరణం చేయాలని ఆయన ప్రతిపాదించారు. అదే విధంగా దాని హెడ్ క్వార్టర్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశం పై ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు బ్యాంకింగ్ సెక్రటరీ ను ఎంపీ బాలశౌరి కలవనున్నారు.

Related posts

ఎక్కడి అభివృద్ధి అక్కడే.. ఇవేనా దశాబ్ది ఉత్సవాలు..?

Satyam NEWS

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఏపికి ఎదురుదెబ్బ

Satyam NEWS

మారిన వాతావరణం.. ఎండకు బదులు వాన..ఎక్కడంటే…?

Satyam NEWS

Leave a Comment