38.2 C
Hyderabad
April 29, 2024 20: 24 PM
Slider ముఖ్యంశాలు

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఏపికి ఎదురుదెబ్బ

#CM YS Jaganmohan Reddy

పోతిరెడ్డి పాడు వద్ద చేపడుతున్న ఎత్తిపోతల పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణ పేట కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పోతిరెడ్డి పాడు వద్ద ఏపి ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన గ్రీన్ ట్రిబ్యునల్ పోతిరెడ్డి పాడు వద్ద చేపడుతున్న ఎత్తిపోతల పథకాలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది.

ఈ మేరకు గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. అదనపు నిర్మాణాలకు సంబంధించి పర్యావరణ ప్రభావం పై నాలుగు శాఖల సభ్యులతో కేంద్ర కమిటీ వేశారు. కేఆర్‌ఎంబీ, కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్‌ కు చెందిన వారికి కమిటీ లో సభ్యత్వం కల్పించినట్లు ఎన్జీటీ తెలిపింది. పర్యావరణ ప్రభావం పై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. కమిటీ నివేదిక వచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్ట వద్దని ఎన్జీటీ సూచించింది.

Related posts

హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ముందస్తు అరెస్ట్

Satyam NEWS

రైతాంగ పోరాట చరిత్రలో నిలిచిన గుండ్రాపల్లి

Satyam NEWS

రాయలసీమలో మళ్లీ పడగ విప్పిన ఫ్యాక్షన్ భూతం

Satyam NEWS

Leave a Comment