దేశవ్యాప్తంగా నదుల అనుసంధానంపై సానుకూల వైఖరితో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కేంద్ర సర్కార్ ను గోదావరి – కృష్ణా నదుల అనసంధానానికి ఆర్థికసాయం అందించాలని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కోరనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఉదయం 11 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. సీఎం కేసీఆర్ నాలుగు రోజుల పాటు ఢిల్లీ లో పర్యటిస్తారు. అదే విధంగా రేపు ఢిల్లీ చేరుకోనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎల్లుండి మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు. గోదావరి – కృష్ణా నదుల అనుసంధానంపై ప్రధాని మోడీతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారు. శనివారం సాయంత్రం ఢిల్లీలో తెలంగాణా, ఏపీ ముఖ్యమంత్రుల భేటీ ఉండే అవకాశం కనిపిస్తున్నది
previous post
next post