39.2 C
Hyderabad
April 30, 2024 20: 24 PM
Slider వరంగల్

ములుగు లో అంగన్ వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ సమావేశం

#anganwadi

ములుగు జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్(టిఎన్ జిఓస్ యూనియన్ అనుబంధం) అంగన్ వాడీ టీచర్లు & హెల్పర్లతో ములుగు జిల్లా కమిటీ మహాసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం టిఎన్ జిఓస్ యూనియన్ ములుగు జిల్లా అధ్యక్షుడు ఠాకూర్ జ్ఞానేశ్వర్ సింగ్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో అంగన్ వాడీ టీచర్ల పాత్ర అమోఘమని, అంగన్ వాడీ టీచర్లపై ఉన్న గౌరవంతో ఈ సమావేశానికి హాజరైనట్లు పేర్కొన్నారు. అంగన్ వాడీ కేంద్రాలలో ఉన్న సమస్యలను, అంగన్ వాడీ టీచర్ల హెల్పర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అంగన్ వాడీ టీచర్లు విధులు నిర్వహించకపోతే గ్రామాలలో చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలకు అందించే సప్లిమెంటరీ ఫీడింగ్ నిలిచి‌ పోతుందని తద్వారా వారి అభివృద్ధి నిలిచిపోతుందని అన్నారు. అంగన్ వాడీ కేంద్రాలలో విధులను సక్రమంగా నిర్వహిస్తూ సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ (టిఎన్ జిఓస్ యూనియన్ అనుబంధం) అంగన్ వాడీ టీచర్లు & హెల్పర్లతో ములుగు జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.

ములుగు జిల్లా అద్యక్షురాలు ఎనగందుల సునీత,కార్యదర్శి అనుమాండ్ల భాగ్య, కోశాధికారి పుట్ట దేవిక,ఉపాధ్యక్షులు కె.మంజుల, లక్ష్మీనర్సమ్మ, సహాయ కార్యదర్శులు గోరంట్ల కవిత,ప్రమీల,ఇసి మెంబర్లు సరోజ,సంధ్యారాణి లను ఎన్నుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ యూనియన్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,యూనియన్ సభ్యత్వం తీసుకోవాలని అన్నారు.

మన సమస్యలను పరిష్కరించుకోవడానికి రోడ్లు ఎక్కి ధర్నా చేసే అవసరం ఉండదని సామరస్యంగా జిల్లా రాష్ట్ర అధికారులను, అదేవిధంగా గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కేటిఆర్, సిఎం కేసిఆర్ ను కలిసేందుకు టిఎన్ జిఓస్ యూనియన్ ప్రతినిధులు సహాయంతో కలువవచ్చుని అన్నారు‌. మనం తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ (టిఎన్ జిఓస్ యూనియన్ అనుబంధం)గా ఏర్పాటు జరిగినప్పటి నుండే అంగన్ వాడీ టీచర్లకు హెల్పర్లకు జీతాలు పెరుగడంతో పాటు సమస్యలు పరిష్కారం జరిగాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ (టిఎన్ జిఓస్ యూనియన్ అనుబంధం) రాష్ట్ర కన్వీనర్ ఎన్.నిర్మల,రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీలత, సుమాంజలి,టిఎన్ జిఓస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాజుతో పాటు అంగన్ వాడీ టీచర్లు,హెల్పర్లు సుమారు 350 మంది హాజరయ్యారు.

Related posts

బాధ్యతతో వ్యవహరించిన ఉద్యోగులకు కడప ఎస్ పి అభినందన

Satyam NEWS

ఆల హటావో… దేవరకద్ర బచావో: రాచాల

Satyam NEWS

ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలి

Satyam NEWS

Leave a Comment