వర్సెటైల్ యాక్టర్ కమల్ హాసన్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఇండియన్ 2. 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. నిజానికి ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా బడ్జట్ విషయాల కారణంగా చాలా రోజుల పాటు ఆగిపోయింది. సమస్యలు తీరిపోవడంతో శంకర్ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ లేటెస్ట్ షెడ్యూల్ ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో మొదలు పెట్టాడు. ఈ సినిమాలో విలన్ పాత్రకి ముందుగా అజయ్ దేవగన్ ని తీసుకోవాలని ప్లాన్ చేశారు కాని అజయ్, జక్కన్న చెక్కుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీ అవ్వడంతో అది కుదరలేదు. ఆ తర్వాత అజయ్ దేవగన్ స్థానంలో అక్షయ్ కుమార్ ని అడిగారు.అయితే అది కూడా వర్కౌట్ కాకపోవడంతో ఇండియన్ 2 సినిమాలో విలన్ ఎవరు అనే డౌట్ అందరిలోనూ మిగిలిపోయింది. ఈ ప్రశ్నకి సమాధానం ఇస్తూ బాలీవుడ్ నటుడు అనీల్ కపూర్ ముందుకు వచ్చాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనీల్ కపూర్ విలన్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అనీల్ కపూర్ శంకర్ దర్శకత్వంలో నటించడం ఇదే మొదటిసారి కాదు, గతంలో అర్జున్ నటించిన ఒకేఒక్కడు సినిమాని హిందీలో నాయక్ పేరుతో అనీల్ చేశాడు. ఈ మూవీని శంకరే డైరెక్ట్ చేసి అనీల్ కపూర్ కి సూపర్ హిట్. దాదాపు 19 ఏళ్ల తర్వాత మళ్లీ అనీల్ కపూర్, శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు
previous post