38.7 C
Hyderabad
May 7, 2024 17: 09 PM
Slider జాతీయం

ఉద్ధవ్ ఠాక్రే నుంచి వీడిపోనున్న మరో ఇద్దరు ఎంపిలు

#uddhavthakre

ఉద్ధవ్ ఠాక్రే వద్ద ఉన్న మరో ఇద్దరు శివసేన ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరతారని శివసేన లోక్‌సభ ఎంపీ కృపాల్ తుమానే బుధవారం ప్రకటించారు. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు షిండే దసరా ర్యాలీకి హాజరవుతారని తుమానే తెలిపారు. ముంబై, మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీలో చేరనున్నట్లు షిండే వర్గం ఎంపీ తుమానే ఓ న్యూస్ ఛానెల్‌తో చెప్పారు. ఎంపీ తుమానే మాట్లాడుతూ షిండే వర్గానికి చెందిన సిద్ధాంతాలకు ఆకర్షితులై వారు చేరుతున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం షిండే వర్గంలో ముఖ్యమంత్రితో సహా 40 మంది ఎమ్మెల్యేలు, 12 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఠాక్రే వర్గానికి 15 మంది ఎమ్మెల్యేలు, 6 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది జూన్‌లో విభజనకు ముందు శివసేనకు మహారాష్ట్ర నుంచి 18 మంది, దాద్రా, నగర్‌ హవేల్‌ నుంచి ఒకరు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. షిండే నేతృత్వంలోని బృందం నేడు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని ఎంఎన్‌ఆర్‌డిఎ మైదానంలో దసరా ర్యాలీని నిర్వహించనుంది.

అదే సమయంలో, సెంట్రల్ ముంబైలోని దాదర్‌లోని శివాజీ పార్టీలో ఠాక్రే వర్గం తన ర్యాలీని నిర్వహించనుంది. ఈ ఏడాది జూన్ నెలలో, ఏక్నాథ్ షిండేతో పాటు మరో 39 మంది ఎమ్మెల్యేలు శివసేనపై తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం పడిపోయింది. దీని తర్వాత జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Related posts

అమెరికా అధ్యక్షుడిపై నెగ్గిన అభిశంసన తీర్మానం

Satyam NEWS

వెంకటేష్ హీరోగా తెలుగులో ‘అసురన్’

Satyam NEWS

మిషన్ భగీరథలో హెల్పర్లుగా 60 మంది విఆర్ఎ లు

Bhavani

Leave a Comment