37.2 C
Hyderabad
April 26, 2024 22: 16 PM
Slider విశాఖపట్నం

మురికి వాడ‌లకు ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి వ‌రాలు

#Vijayasaireddy

అధికార  పార్టీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి విశాఖ లో సుడిగాలిలా ప‌ర్య‌టించారు. న‌గ‌రంలోని ప‌లు మురికివాడల ప్రాంతాల‌ను  అక్క‌డి స్థానికులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా ప‌రిశీలించి…వారి గొడును విన్నారు.

త‌మ ట్ర‌స్టు ద్వారా మంచినీరు, రోడ్లు, త్రాగునీరు, క‌మ్యూనిటీ భ‌వ‌నాలు, ముస్లిం సోద‌రుల‌కు ప్రార్ద‌నా మందిరం త‌దిత‌ర మౌలిక స‌దుపాయ‌లు క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చ‌రు. ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా ప్ర‌భుత్వ ప‌రంగా చేయాల్సిన అభివృద్ది ప‌నులు మార్చి 15 కి వాయిదా వేసామ‌ని  ఆ త‌ర్వాత చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

న‌గ‌రంలోని సీత‌మ్మ‌ధార, కంచ‌ర‌పాలెం ప్రాంతాల‌లోని ద‌శాబ్దాలుగా అప‌రిష్కృతంగా ప‌డి ఉన్న స‌మ‌స్య‌లను వైఎస్ఆర్సీపీ ఎంపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి, స్థానిక మంత్రి అవంతి శ్రీ‌నివాస్, ఎంపి స‌త్య‌న్నారాయ‌ణల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు.

ఈ సందర్భంగా అక్క‌డి ప్ర‌జ‌లు త‌న దృష్టికి తెచ్చిన ప‌లు స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తూ, సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌కు మేర‌కు తాము ప‌ర్య‌టిస్తున్నామ‌ని న‌గ‌రంలోని మురికి వాడ‌లు సంద‌ర్శించి అక్క‌డి ప్ర‌జ‌లు స‌మ‌స్య‌లకు త‌క్ష‌ణ ప‌రిష్కారం చూపాల్సిందిగా ముఖ్యంత్రి త‌మ‌ను ఆదేశించార‌ని అన్నారు.

ఈ ఆమేర‌కు స్థానిక సీత‌మ్మ‌ధార ప‌రిధిలోని ఎ.ఎన్. ఆర్ న‌గ‌ర్, ఎ.ఎస్.ఆర్ న‌గ‌ర్, గ‌ణేష్ న‌గ‌ర్, గిరిజ‌నులు (చెంచుల) కోల‌ని, సంతోషి మాత కోల‌ని మ‌రియు వాసుదేవ న‌గ‌ర్ కాల‌నీల‌ను స‌ద‌ర్శించారు.  అనంత‌ర బాల శాస్థృల‌ లేఅవుట్  కాల‌నీలో ప‌ర్య‌టించి అక్క‌డి ప్ర‌జ‌ల స‌మ‌ప్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. 

అక్క‌డి వారు త‌మకు ధోబి ఘాట్ కావాల‌ని కోర‌డంతో ప్ర‌క్క‌నే ఉన్న 146 స‌ర్వే నంబ‌ర్లో ని ప్ర‌బుత్వ భూమిలో నిర్మించి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అనంత‌రం గిరిజ‌నులు (చెంచుల ) కోల‌ని సంద‌ర్శించి అక్క‌డి ప్ర‌జ‌ల స‌మ్యస్య‌లు అడిగి తెలుసుకున్నారు.

అయితే అక్క‌డ ప్ర‌భుత్వం మంజూరు చేసిన 432 ఇల్ల‌కు కేవ‌లం 244 మాత్ర‌మే నిర్మించ‌డం జ‌రిగింద‌ని అక్క‌డి వారు త‌న దృష్టికి తీసుకురావ‌డంతో సంబందిత మంత్రితో మాట్లాడి త‌క్ష‌ణ‌మే మిగిలిన ఇల్ల నిర్మించి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.

కొంద‌రు ప్రైవేటు వ్య‌క్తులు కోర్టును ఆశ్ర‌యించ‌డంతో త‌మకు ఇల్ల పట్టాలు రాలేద‌ని చెప్ప‌డంతో స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అక్క‌డ నివ‌సిస్తున్న గిరిజ‌న యువ‌త‌కు లోన్లు మ‌రే ఇత‌ర స‌దుపాయ‌లు అంద‌డం లేద‌ని తెపుడంతో జిసిసి సంబందింత మంత్రిలో మాట్లాడి ప‌రిష్కారం చూపుతాన‌ని హామీ ఇచ్చారు.

అనంత‌రం కంచర‌పాలెంలోని ప‌లు మురికి వాడ‌లు సంద‌ర్శించి అక్క‌డి స‌మ‌స్య‌లు తెల‌సుకొని త్వ‌ర‌లోనే ప‌రిష్కారం చూపుతాన‌ని అన్నారు. రాజ్య‌స‌భ సభ్యులు మొపిదేవి వెంకట ర‌మ‌ణ వైకాపా నాయ‌కులు కె కె రాజు త‌ద‌త‌రులు పాల్గొన్నారు.

Related posts

5 నెలల గరిష్టానికి రోజువారీ కేసులు

Murali Krishna

కరోనా ఎఫెక్ట్: నేటి నుండి రేషన్ బియ్యం పంపిణీ

Satyam NEWS

ఆరెస్సెస్‌తో సమావేశంపై జమాతే ఇస్లామీ ప్రజలకు సమాధానం చెప్పాలి

Satyam NEWS

Leave a Comment