33.7 C
Hyderabad
April 28, 2024 23: 51 PM
Slider వరంగల్

భారీ వర్షాల నేపధ్యంలో మంత్రి సత్యవతి సమీక్ష

#satyavatirathod

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అప్రమత్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పక్కాగా వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలని ఆమె కోరారు.

మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్, ఎస్పీ, వివిధ శాఖల అధికారులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల  నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేయాలన్నారు.

సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి  ఆదేశించారు. ప్రస్తుత సమయంలో ఎవరు కూడా సెలవుల్లో వెళ్లకుండా, పూర్తి అప్రమత్తతో విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా సత్వర చర్యలు తీసుకోవాలని, వరద ఉధృతి తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్ లకు వర్ష ప్రభావిత ప్రాంతాల నుండి ఏదైనా సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని సమాయత్తపర్చాలని మంత్రి అధికారులకు తెలిపారు.

విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో కుంభవృష్టి కురియడంతో  చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తునందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా చేపలు పట్టే వారు, ఈత సరదా కోసం పిల్లలు, యువత చెరువులు, వాగులోకి దిగకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related posts

శాంతి భద్రతల డ్యూటీ కి మహిళా పోలీస్ దూరం

Bhavani

పవర్ వార్: కేంద్రంలో ఢీ కొడుతున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

మరో 48 గంటల పాటు భారీ వర్షాలు

Satyam NEWS

Leave a Comment