42.2 C
Hyderabad
April 26, 2024 18: 22 PM
Slider విజయనగరం

విజయనగరం జిల్లా కు మరో లేడి పోలీసు అధికారి

#AsmaFarheen

విజయనగరం జిల్లా సెబ్ అదనపు ఎస్పీ గా అస్మా ఫర్హీన్ జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీరావు నుండి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, జిల్లా ఎస్పీ ఎం.దీపిక ను మర్యాద పూర్వకంగా కలిసి, పుష్ప గుచ్ఛం ను అందజేశారు. ఈ సందర్భంగా సెబ్ అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్ మాట్లాడుతూ – మద్యం అక్రమ విక్రయాలు, రవాణ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి పెట్టి, కఠిన చర్యలు చేపట్టనున్నట్లుగా తెలిపారు.2012 లో డైరెక్ట్ డిఎస్పీగా పోలీసుశాఖలో చేరిన శ్రీమతి అస్మా ఫర్హీన్ రాజమండ్రి, విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో డిఎస్పీగా గతంలో పని చేశారు.

అనంతరం, అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది కృష్ణ జిల్లా సెబ్ అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు.కాగా ఇంతవరకు ఉన్న సెబ్ ఏఎస్పీ శ్రీదేవి కి ఎస్పీ గా పదోన్నతి పై వెళ్లడంతో, అస్మా ఫర్హీన్ విజయనగరం జిల్లాకు బదిలీపై వచ్చారు.

Related posts

స్నేహితునికి చేయూతనిచ్చిన పూర్వ విద్యార్ధులు

Satyam NEWS

అందుబాటులోకి యాస్ తుఫాను కంట్రోల్ రూమ్

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిధర్‌?

Satyam NEWS

Leave a Comment