30.7 C
Hyderabad
April 29, 2024 06: 09 AM
Slider నెల్లూరు

ప్రతి ఒక్కరి మేలుకోసమే జగనన్న సురక్ష కార్యక్రమం

#Jagananna Suraksha

సమాజంలో ప్రతి ఒక్కరికి మేలు చేసేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి “జగనన్న సురక్ష” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మొదట నెల్లూరు రూరల్ మండల పరిధిలోని కొండ్లపూడిలో శనివారం జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు.

తర్వాత పొట్టే పాలెంలో 65 లక్షల రూపాయలతో నిర్మించే సిమెంట్ రోడ్డు, సైడ్ కాలువలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మతో కలిసి శంకుస్థాపన చేశారు.

అనంతరం పొట్టే పాలెం లో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అందించే పథకాలు ఒకరిద్దరికి చిన్న కారణాలతో నిలిచిపోకుండా అధికారులను, సిబ్బందిని ఒకే చోట సమన్వయం చేసి మేలు చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ప్రతి ఒక్కరికి మేలు జరగాలన్నదే ఈ కార్యక్రమాల లక్ష్యం అని పేర్కొన్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయలేదని గుర్తు చేశారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల సహకారంతో ప్రతిదీ అందుబాటులోకి తెచ్చారని స్పష్టం చేశారు. ఎక్కడైనా చిన్న అన్యాయం జరిగినా తాము అండగా ఉంటామని తెలిపారు.

రేషన్లో, ఆధార్లో మార్పులు చేసుకోదలచిన వారికి ఇదో ఒక మంచి అవకాశం అని, కొండ్లపుడికి రోడ్డు మంజూరు చేసినట్లు ఎంపీ ఆదాల తెలిపారు. జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ రూరల్ పరిధి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున మనకు నిధులు లభిస్తాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇద్దరు మహిళలు తమకు పథకాలు అందలేదని గట్టిగా చెప్పడంతో శాంతంగా ఉండమని, పరిస్థితిని విచారించి లబ్ధిని చేకూర్చాలని ఎంపీ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.

ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అందరికీ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్ రెడ్డి, రూరల్ మండలాధ్యక్షుడు విజయకుమార్, సర్పంచ్ సుజాతమ్మ, పల్లం రెడ్డి సుధాకర్ రెడ్డి, శేషురెడ్డి, బండి శ్రీకాంత్ రెడ్డి స్థానిక నేతలు పలువురు పాల్గొన్నారు. పొట్టే పాలెంలో స్థానిక నేతలు భారీ గజమాలలతో సత్కరించి, సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ వెంకయ్య, శివరామిరెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, మల్లు సుధాకర్ రెడ్డి, అబుబకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్వచ్ఛ తెలంగాణ సాధన లో మరో ముందడుగు

Satyam NEWS

బౌన్సర్ హిట్ :బంతి బ‌లంగా తాక‌డంతో షాహిద్ క‌పూర్ త‌ల‌కి 13 కుట్లు

Satyam NEWS

సైరా చిత్రం విడుదలను అడ్డుకోలేం

Satyam NEWS

Leave a Comment