38.2 C
Hyderabad
April 29, 2024 11: 17 AM
Slider ఆదిలాబాద్

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అవగాహన కార్యక్రమాలు

#adilabad police

బాల్యవివాహాలతో అనేక అనర్థాలు సంభవిస్తాయని అదిలాబాద్ సిఐ ఈ చంద్రమౌళి పేర్కొన్నారు. శనివారం స్థానిక పట్టణంలోని విద్యా నగర్ కాలనీలో బాల సదనం కార్యాలయాన్ని సందర్శించి, అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా బృందం సభ్యులు బాల్య వివాహాలను అరికట్టడానికి, “తన ఎదుగుదలని ఏడడుగులతో అపొద్దు” అనే శీర్షికతో ఉన్న గోడ పత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మహిళల భద్రత కోసం పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగ శాఖ అధికారులతో కలిసి అనేక చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

మండలం, గ్రామ స్థాయిలో పోలీస్ కళాజాత బృందాలు షీటీం సభ్యులచే నాటికల ద్వారా ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరిస్తూ, ఆలోచన చేసే విధంగా ప్రేరేపిస్తున్నామని తెలిపారు.

బాల్య వివాహాలు ఏక్కడ జరిపిన వెంటనే డయల్-100 నెంబర్ కు సమాచారం అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బాల్య వివాహాలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పర్యవేక్షకురాలు సరోజ, అకౌంటెంట్ కె రమేష్, లీగల్ కం ప్రొబేషన్ అధికారి, సోషల్ వర్కర్స్ కరుణశ్రీ, రవికాంత్, టీ వీణా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్సై ఎం ఏ హకీం, ఏఎస్సై ఎస్కే తాజుద్దీన్, కానిస్టేబుళ్లు ఠాకూర్ జగన్ సింగ్, మంగల్ సింగ్, కె హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేద రైతులకు అన్యాయం చేయడమే రెవెన్యూ అధికారుల ఉద్దేశ్యమా?

Satyam NEWS

స్టింకింగ్లీ రిచ్: ఈ అమ్మాయికి పెళ్లవుతోంది

Satyam NEWS

రాజంపేట లో టీడీపీ సాధన దీక్ష…

Satyam NEWS

Leave a Comment