38.2 C
Hyderabad
April 28, 2024 20: 33 PM
Slider ఆంధ్రప్రదేశ్

రమేష్ కుమార్ కేసులో ఫైనల్ హియరింగ్ 28న

AP High Court

అర్ధంతరంగా తన పదవీ కాలం కుదించిన అంశంపై రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కేసులో ఫైనల్ హియరింగ్ ఈ నెల 28న ఉంటుందని హైకోర్టు వెల్లడించింది. సంబంధిత పిటిషన్లపై నేడు హైకోర్టులో గంట సేపు వాదనలు, ప్రతి వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిషనల్ కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు.

దాంతో ఈ నెల 24 లోగా అడిషనల్ కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. ప్రభుత్వం వినిపించే అదనపు వాదనకు ప్రతిగా కౌంటర్ దాఖలు చెయ్యటానికి పిటిషనర్లకు  27 వరకు గడువు ఇచ్చారు. ఫైనల్ హియరింగ్ 28 న ఉంటుంది. కౌంటర్ల దాఖలు తేదీల విషయంలో ప్రభుత్వానికి, పిటిషనర్ల కు ఎటువంటి మినహాయింపులు ఉండవని కోర్టు స్పష్టం చేసింది.

Related posts

మాన్సాస్ ట్రస్టు: జగన్ జీవో కొట్టివేతను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం

Satyam NEWS

చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

Satyam NEWS

కొత్త రెవెన్యూ చట్టాన్ని, ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకించండి

Satyam NEWS

Leave a Comment