37.2 C
Hyderabad
April 26, 2024 19: 41 PM
Slider ముఖ్యంశాలు

అంధకారంలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ

వైకాపా ప్రభుత్వ హయాంలో ఆర్ధిక వ్యవస్థ అంధకారంలో నెట్టివేయబడిరదని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శుక్రవారం జరిగిన ప్రజాపోరు వీధి సభల్లో భాగంగాపార్టీ నాయకులతో కలసి పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం పాలన అర్ధాన్ని మార్చివేసిందన్నారు. మూడేళ్లుగా అభివృద్ధి అనే మాట కూడా వినడం లేదన్నారు. మౌలిక సదుపాయాలకు ఏమాత్రం నిధులు వెచ్చించడం లేదన్నారు. అధికారం వచ్చింది దరిమిలా వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలనే యావ తప్పించి మరో ఆలోచన చేయలేదన్నారు. సంక్షేమం పేరుతో నవరత్నాలనే పేరుతో డబ్బు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఓట్లు కొనుగోలుచేస్తున్నారని విమర్శించారు.

వైకాపా ప్రభుత్వం చేస్తున్న గుండాయిజం, అవినీతితో కొత్త పరిశ్రమల పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదన్నారు. ఆదాయం సరిపోక అప్పులు తెచ్చి నగదు పంపిణీ చేస్తున్నారని దుయ్యబట్టారు. సలహాదార్లకు, లాయర్లకు, ప్రకటనలకు ప్రజల సొమ్మును ఖర్చుచేస్తూ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోతున్నారని, పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని, ఒక్క ఇటుక రాయి కూడా వేయలేదని ఇంక అభివృద్ది ఏం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి పెరిగిపోయిన లక్షల కోట్ల అప్పుల వార్తలను విని ఇతర రాష్ట్రాల ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Related posts

రిక్వెస్టు: కరోనా డొనేషన్లు ఇంకా విరివిగా ఇవ్వాలి

Satyam NEWS

కొల్లాపూర్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసుల నిరంతర దాడులు

Satyam NEWS

ఎన్నికల కోడ్ అమలులో ఉందో లేదో చెప్పగలరా?

Satyam NEWS

Leave a Comment