32.7 C
Hyderabad
April 27, 2024 00: 45 AM
Slider సంపాదకీయం

యాప్ లు ఇలానే నొక్కి ఉంచితే ఇక చైనా ఫసక్

#Tik Tok app

భారత్ ఇంటర్ నెట్ లో 38 శాతం విస్తరించి ఉన్న చైనా యాప్ లను బ్యాన్ చేయడం ఆ దేశ ఐటి కంపెనీలకు తీరని నష్టం కలిగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచాన్ని తమ ఐటి ఉత్పత్తులతో శాసించాలని భావిస్తున్న చైనాకు భారత్ వేసిన ఎత్తుగడ తొలి అతి పెద్ద దెబ్బ.

2019లో టిక్ టాక్ యాప్ 5.5 బిలియన్ ఇంటర్ నెట్ గంటలను భారత్ లో వినియోగించారు. 2018లో కేవలం 900 మిలియన్ ఇంటర్ నెట్ గంటలు మాత్రమే ఆ యాప్ ను వాడారు. అంటే ఒక్క ఏడాదిలో భారత్ లో టిక్ టాక్ యాప్ విస్తరణ చైనా కంపెనీలకు కాసులు పండించింది.

ప్రపంచం మొత్తం ఇప్పుడు చైనాకు వ్యతిరేకమే 

భారత్ లో ఫేస్ బుక్ పై వినియోగదారులు 25.5 బిలియన్ గంటలు ఉంటారు. దాన్ని అధిగమించేందుకు టిక్ టాక్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో భారత్ దానికి కోలుకోలేని దెబ్బ కొట్టింది. అంతే కాదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు చైనాపై తీవ్రమైన కోపంతో ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశాలన్నింటికి భారత్ దోవ చూపించినట్లు అయింది. ఆ దేశాలు కూడా చైనా యాప్ లను, చైనా సాఫ్ట్ వేర్ ను బ్యాన్ చేయడం మొదలు పెడితే చైనాకు తిక్కదిగుతుంది.

భారత్ చేసిన ప్రయోగం సఫలీకృతం అయింది. అయితే ఇప్పుడు వస్తున్న వత్తిడులకు తలవొగ్గ కుండా కేంద్ర ప్రభుత్వం నిలబడాల్సి ఉంటుంది. తనతో బాటు మరి కొన్ని దేశాలు కూడా చైనా సాఫ్ వేర్ ను బ్యాన్ చేసేలాగా భారత్ చేయగలిగితే చైనా ఆర్ధికంగా దెబ్బతినే సంగతి ఎలా ఉన్నా నైతికంగా తీవ్రమైన వత్తిడి ఎదుర్కొంటుంది. 2019లో యాపిల్ స్టోర్,  ఆండ్రాయిడ్ సిస్టమ్ లపై ఫేస్ బుక్ ను 156 మిలియన్ సార్లు డౌన్ లోడ్ చేసుకోగా టిక్ టాక్ కేవలం ఆ ఒక్క సంవత్సరంలోనే 323 మిలియన్ సార్లు భారత్ లో డౌన్ లోడ్ చేసుకున్నారు.

టిక్ టాక్ పై కొట్టిన దెబ్బ సామాన్యమైనది కాదు

ఈ ఏడాది గడిచి ఉన్నట్లయితే టిక్ టాక్ యాప్ భారత్ లో తిరుగులేని శక్తిగా మారి ఉండేది. అంతే కాకుండా చైనా కంపెనీలకు కాసుల వర్షం కురిసి ఉండేది. గత ఏడాది ఒక్క డిసెంబర్ నెలలోనే టిక్ టాక్ యాప్ పై 11 దేశాలు వాడినంత సమయాన్ని భారత్ వాడింది.

హలో యాప్ భారత మార్కెట్ ను రెవెన్యూ పరంగా కాకుండా యూజర్ల పరంగా చూసుకున్నది. దాంతో భారత్ పై ప్రత్యేక దృష్టి సారించి విజయం సాధించింది. హలో యాప్ 2019 ఆర్ధిక సంవత్సరంలో భారత్ నుంచి రూ.44 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే భారత్ నుంచి ఆ కంపెనీ రూ.22 నుంచి 30 కోట్లు ఆర్జించి ఉంటుందని ఒక అంచనా.

చైనా సాఫ్ట్ వేర్ దిగ్గజాలకు చుక్కలు కనిపించాయి

భారత్ బ్యాన్ చేసిన 59 యాప్ లు కూడా చిన్న కంపెనీలవేం కాదు. చైనాలో దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీలు అయిన అలీబాబా, బైటెడెన్స్, బైదూ, టెన్సెంట్, గ్జియోమీ, వైవై ఇన్ కార్పొరేషన్, లెనోవో లకు చెందిన యాప్ లన్నింటిని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ కంపెనీలన్నీ చైనాలో కన్నా ఎక్కువ రెవెన్యూ ను భారత్ నుంచి సంపాదిస్తున్నాయంటే ఆశ్చర్యంకలుగక మానదు.

కమ్యూనిస్టు మేధావుల మాటలు పట్టించుకోవద్దు

20 మంది భారత సైనికులను అతి కిరాతకంగా మేకులు పెట్టిన కర్రలతో అనాగరికంగా కొట్టి చంపిన చైనా పై భారత్ ప్రయోగించిన ఈ మిస్సైల్ కు దేశ ప్రజలంతా సహకరించాలి. చైనాకు అనుకూలంగా కమ్యూనిస్టులు చేసే వాదనలను ఎవరూ పట్టించుకోరాదు. భారత్ కు తాత్కాలికంగా జరిగే నష్టం పెద్దదేం కాదు.

చైనా సాఫ్ట్ వేర్ లేకుండా మన దేశం మనుగడ సాగించలేదని ఇప్పటికే కమ్యూనిస్టు మేధావులు ఒక వాదన బయటకు తెస్తున్నారు. దేశ ప్రజలు ఇలాంటి వాదనలు పట్టించుకోవద్దు. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్క మెట్టు కూడా కిందికి దిగవద్దు. వీలైతే మరింతగా బిగించాలి. చైనాకు ఊపిరి ఆడకూడదు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్.నెట్

Related posts

ఎకరాకు 10వేలు

Murali Krishna

ఘనంగా “దేవరకొండలో విజయ్ ప్రేమ కథ” ప్రీ రిలీజ్ కార్యక్రమం

Satyam NEWS

జ‌న‌వ‌రి 2న నాద‌నీరాజ‌నం, సుందరకాండ అఖండ పారాయ‌ణం

Sub Editor

Leave a Comment