33.7 C
Hyderabad
April 28, 2024 23: 55 PM
Slider ఖమ్మం

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తులు

#Congress MLA candidature

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున తమకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరుతూ హైదరాబాద్ గాంధీభవన్ లో ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని మొత్తం పది సెగ్మెంట్లలో ఏడు సెగ్మెంట్లకు గాను ఆరుగురు తమ దరఖాస్తులను సమర్పించారు. జనరల్ స్థానాలైన పాలేరు, ఖమ్మం నుంచి ఏదొక సెగ్మెంట్లో అవకాశం ఇవ్వాలని కోరుతూ

మాజీ డీసీసీబీ ఛైర్మన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మువ్వా విజయబాబు దరఖాస్తు చేసుకున్నారు. ఎస్టీ రిజర్వుడ్ స్థానాలైన ఇల్లందు (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య), పినపాక (మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు), వైరా (విజయబాయి), అశ్వారావు పేట (జారె ఆదినారాయణ), ఎస్సీ రిజర్వుడ్ స్థానం సత్తుపల్లి (కొండూరు సుధాకర్) తమ దరఖాస్తును అందజేశారు.

Related posts

పద్మారావు గౌడ్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు

Satyam NEWS

పేదలు ఆర్థికంగా బలపడేలా అభివృద్ది పథకాలు

Satyam NEWS

సహాయ కార్యక్రమాల్లో ఎన్జీఓలను భాగస్వామ్యులను చేయాలి

Satyam NEWS

Leave a Comment