35.2 C
Hyderabad
April 27, 2024 13: 09 PM
Slider ఖమ్మం

ఈవీఎం ల తరలింపుకు ఏర్పాట్లు

#evm

రానున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల దృష్యా జిల్లాలోని ఐదు నియోజక వర్గాలకు కేటాయించిన ఈవియంల తరలింపుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలోని ఈవియం గోడౌన్ నుండి ఐదు నియోజక వర్గాల కొరకు ఏర్పాటు చేసిన పంపిణి కేంద్రాలకు ఈవియం, సియు, వివిపాట్ ల తరలింపు కొరకు పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 20న మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోగా, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవియం గోడౌన్ తెరిచి ర్యాండమైజేషన్ ప్రకారం ఓటింగ్ యంత్రాలను సిద్దం చేసుకొని, నియోజకవర్గాల వారిగా ఖమ్మం నియోజక వర్గంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్, పాలేరు నియోజకవర్గంలోని కిట్స్ కళాశాల, మధిర నియోజకవర్గంలోని మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వైరా నియోజకవర్గంలోని వైరా సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల, సత్తుపల్లి నియోజక వర్గంలోని స్థానిక జ్యోతి నిలయం హైస్కూల్ లలో ఏర్పాటు చేసుకున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు తరలించి భద్రపరచడం జరుగుతుందని, ఆ తరువాత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అబ్జర్వర్ పర్యవేక్షణలో రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు డిసిపి ప్రసాద్ రావు, జెడ్పి సిఇఓ వివి. అప్పారావు, డిటివో సత్యనారాయణ, జిల్లా రవాణా అధికారి టి. కిషన్ రావు, ఆర్డీవోలు జి. గణేష్, అశోక్ చక్రవర్తి, ఎస్డీసి రాజేశ్వరి, ఖమ్మం పట్టణ ఏసీపీ హరికృష్ణ, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి తిరుమలరావు, బీజేపీ పార్టీ ప్రతినిధి జిఎస్ఆర్ఏ. విద్యాసాగర్, సిపిఐ(ఎం) పార్టీ ప్రతినిధి ఆర్. ప్రకాష్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బాలగంగాధర తిలక్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి జి. కృష్ణ, టిడిపి ప్రతినిధి కె. కరుణాకర్, బిఎస్ పి పార్టీ ప్రతినిధి ఉపేందర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Operation PFI: ఎంతో పకడ్బందిగా ప్లాన్…హ్యాట్సాఫ్ NIA

Satyam NEWS

రామతీర్థం… నీలాచలం కొండపై కొత్త విగ్రహాలు ప్రతిష్ఠ

Satyam NEWS

శివోహం: కిటకిటలాడిన కీసర శ్రీ రామలింగేశ్వరుడు

Satyam NEWS

Leave a Comment