40.2 C
Hyderabad
April 29, 2024 16: 51 PM
Slider ప్రత్యేకం

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

#suryapet

సూర్యాపేట జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఆదిశగా సత్వర చర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్  సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో  స్వతంత్ర వజ్రోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత్ కేశవ్, యస్. మోహన్ రావు లతో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 9 నుండి 21 తేదీలలో  నిర్వహిస్తున్న వేడుకలు ఘనంగా ఉండాలని అధికారులందరు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఎక్కడకూడా ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలి. వేడుకల షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని  ఆదేశించారు. జిల్లాలో మొదట 9న జరిగే జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో అన్ని నియోజక వర్గాల వారీగా ప్రజాప్రతినిధులను తప్పక ఆహ్వనించి జెండా పంపిణీ కార్యక్రమాన్ని ప్రాంభించుకొని  తదుపరి మున్సిపల్, జి.పి. అధికారుల పర్యవేక్షణలో ప్రతి ఇంటికి జెండా అందేలా చూడాలని ఆదేశించారు.

జిల్లాలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాలకు  రంగులు వేసి అలాగే పరిసర ప్రాంతాలను పరిశుభ్రఅంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న అన్ని సినిమా థియేటర్ లలో మహాత్మా గాంధీ సినిమా అందుబాటులో ఉంచామని విద్యా శాఖ అధికారులు షెడ్యూల్ పురస్కారం  6 వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులకు ఆర్.టి.సి బస్సులలో తిసుకెళ్లి సినిమాను తప్పక చూపించాలని ఆదేశించారు. ముఖ్యoగా జిల్లా సరిహద్దు అయిన కోదాడ నియోజక వర్గంలో గల నల్లబండ వద్ద వజ్రోత్సవాల తోరణం ఏర్పాట్లను ఘనంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.          

జిల్లాలో గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో ఈ నెల 9 నుండి 21 వ తేదీ వరకు వజ్రోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 8 న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీద హైదరాబాద్లో ప్రారంభిస్తారని, 9 న జిల్లాలో వేడుకల ప్రారంభంలో భాగంగా ప్రతి ఇంటికి జాతీయ జెండాలను పంపిణీ చేసి ఎగురవేసేటప్పుడు అనుసరించాల్సిన నియమాలను ప్రజలకు వివరించాలని అన్నారు.

10 న వనమహోత్సవం లో భాగంగా ఫ్రీడం పార్కుల ఏర్పాటు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మొక్కలు నాటాలని,అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయం లలో అటవీ భూముల్లో,ఖాళీ ప్రదేశం లలో 75 సంవత్సరాలు గుర్తు చేసేలా 75 గుణిజాల్లో మొక్కలు నాటాలని, అన్నారు. 11న పోలీస్, యువజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఫ్రీడమ్ రన్  నిర్వహణ, 12 న జాతీయ సమైక్యతా రక్షా బంధన్ కార్యక్రమాలను నిర్వహించి స్థానిక కేబుల్ టీవీ లలో విస్తృత ప్రచారం చేపట్టాలని  ఆదేశించారు.

13న జెండా, ప్లకార్డులతో NCC, NSS, స్కౌట్స్, గైడ్స్ విద్యార్థులు, ఉద్యోగులచే ర్యాలీలు, సమ్మేళనాలు, త్రివర్ణాల విడుదల, 14 న  జానపద, తెలంగాణ సాంస్కృతిక సారథి  కళాకారులచే ప్రదర్శనలు ఏర్పాటు నిర్వహించాలని సూచించారు. 15 న ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ,స్వాతంత్ర్య సమర యోధుల సన్మానం, 16 న తెలంగాణ రాష్ట్ర సామూహక జాతీయ గీతాలాపన, కవి సమ్మేళనం, 17 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, స్వచ్చంధ సంస్థల సమన్వయంతో రక్తదాన శిబిరాలు కనీసం 75 మంది దాతలతో నియోజక వర్గాల వారీగా నిర్వహించాలని సూచించారు. 

18 న క్రీడా శాఖ ఆధ్వర్యంలో ‘ఫ్రీడం కప్’  మండల, జిల్లా స్థాయిలో ఉద్యోగులు, యువతతో క్రీడల నిర్వహణ, 19 న ఆసుపత్రులు, జైళ్లు, అనాథ, వృద్ధాశ్రమాలలో పండ్లు, స్వీట్ల పంపిణీ చేయాలన్నారు. 20 న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలచే దేశభక్తి  అంశంపై రంగోలి, 21 న జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్, గ్రామపంచాయితీలు, మునిసిపాలిటీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలనీ అన్నారు.

ప్రజా ప్రతి నిధులు భాగస్వామ్యులను చేసి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవ  ఉత్సవాలను ఘనంగా నిర్వహిచడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో   ఆర్.డి.వోలు రాజేంద్రకుమార్, వెంకరెడ్డి, సి.పి.ఓ జి. వెంకటేశ్వర్లు, డి.ఏ.ఓ రామారావు నాయక్, డి.యస్.ఓ విజయ లక్ష్మి, ఆర్. అండ్ బి ఈ ఈ యాకుబ్, డి.హెచ్.ఓ శ్రీధర్ గౌడ్, డి.పి.ఓ యాదయ్య,పి.డి. కిరణ్ కుమార్, సంక్షేమ అధికారులు శంకర్, అనసూర్య, దయానంద రాణి, శిరీష, ఫైర్, పోలీస్, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొండపై ఫైర్: శ్రీవారి పోటులో స్వల్ప అగ్నిప్రమాదం

Satyam NEWS

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిష్ర్కమణ

Satyam NEWS

జూన్ 28 నుండి జూలై 6వ వరకు శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

Bhavani

Leave a Comment