28.7 C
Hyderabad
April 28, 2024 05: 38 AM
Slider ప్రపంచం

పాకిస్తాన్ కు నిలిచిపోయిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సాయం

#imrankhan

పాకిస్తాన్ లో నెలకొన్ని రాజకీయ అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఆర్ధిక సాయాన్ని నిలిపివేసింది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ప్రభుత్వం అకస్మాత్తుగా సంక్షోభానికి గురై అర్ధంతరంగా ముగిసిపోయింది.

దేశాన్ని రాజకీయ శూన్యత ఆక్రమించడంతో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నది. ఇస్లామాబాద్‌లోని IMF  ప్రతినిధి ఎస్తేర్ పెరెజ్ రూయిజ్ మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతగానీ ఏ పరిస్థితి చెప్పలేమని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి 6 బిలియన్ డాలర్ల ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కల్పించింది.

అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనడానికి ఇబ్రాన్ ఖాన్ రాజీనామా చేయడం, నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల పాకిస్తాన్ లో రాజ్యాంగ శూన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశంలో హింసాత్మక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. రాజకీయంగా అశాంతి ఎక్కువైంది. ఈ కారణాలతో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తన నిధులను పాకిస్తాన్ కు ఇవ్వడాన్ని ఆపివేసింది.

అయితే తాము నిధులను తాత్కాలికంగా మాత్రమే నిలుపుదల చేశామని, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారి ఆర్ధిక విధానాలను పరిశీలించి తదుపరి విడత నిధులను విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఎస్తేర్ పెరెజ్ రూయిజ్ తెలిపారు. పాకిస్తాన్ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించే విధానాలపై IMF ఆర్ధిక సాయం అందిస్తుందని ఆయన తెలిపారు.

Related posts

అలరించిన రమ్యా సుబ్రమణియన్ భరతనాట్యం

Satyam NEWS

5 సంవత్సరాలలో గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా

Satyam NEWS

పెనుకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం అస్తవ్యస్తం

Bhavani

Leave a Comment