38.2 C
Hyderabad
April 29, 2024 20: 55 PM
Slider ముఖ్యంశాలు

నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులపై ప్రజలలో అవగాహన

#tropicaldisease

నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులపై (Neglected Trapical Diseases) ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 30 ఆదివారం  ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.రమణకుమారి తెలిపారు. 

ఈ మేరకు తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎంఅండ్ హెచ్ ఓ రమణకుమారీ ,జిల్లా మలేరియా అధికారి తులసి లు మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 20 రకాల నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధులను గుర్తించి వాటికి ప్రాధ్యాన్యత కల్పించడం జరిగిందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరం నుండి ఈ వ్యాధులను నిర్మూలించడానికి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.  

ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న దేశాలలో తక్కువ ఆదాయం కలిగి పేదరికంతో వున్న మురికివాడలల్లో నివశిస్తున్న ప్రజలు శారీరక శుద్ది లేకపోవడంతో తరచుగా వైరస్ లు, బాక్టీరియా, అంటువ్యాధులకు గురై డెగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, డలేరియా, పచ్చకామెర్లు, కుష్టివ్యాధి, రాబిస్, మట్టినుండి వ్యాప్తి చెందే వ్యాధులు గజ్జి, పాము కాటు తదితర 20 రకాల వ్యాధుల వలన ప్రజలు అనారోగ్యపాలు అవుతున్నారని,  ఇవి సాదారణ వ్యాధులుగా కనిపించినప్పటికి ఒక్కోక్కసారి ప్రాణాంతకంగా మారే అవకాశం వుందన్నారు.   ఈ వ్యాధులపై ప్రజలలో ఆరోగ్య అలవాట్లు, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఈ ఆదివారం నుండి నిర్వహించడం జరుగుతుందన్నారు.

Related posts

అక్రమంగా పొలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితుల ఆందోళన

Satyam NEWS

చెత్తపలుకు: కాశ్మీర్ టు కియా మోటార్స్

Satyam NEWS

ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళన విజయవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment