30.3 C
Hyderabad
March 15, 2025 10: 18 AM
Slider ఆధ్యాత్మికం

డోర్ క్లోజ్: అయ్యప్ప దర్శనం ఇక ఇప్పటికి లేదు

malaya araya

రెండు నెలలకు పైగా మండలం-మకరవిలక్కు తీర్థయాత్రల తరువాత శబరిమల లోని అయ్యప్ప ఆలయాన్ని మూసి వేశారు. ఈ నెల 15 వ తేదీన మకరవిళక్కు కార్యక్రమం ముగిసింది. అయినప్పటికీ భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో సోమవారం వరకూ ఆలయాన్ని తెరిచి ఉంచారు. నేడు ఆలయాన్ని మూసి వేశారు. ఈ చివరి రోజు కూడా పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో శబరిమల కిటకిటలాడింది. సాంప్రదాయం ప్రకారం, పందలం ప్యాలెస్ రాజు గర్భగుడి ముందు ప్రార్థనలు చేశారు. తరువాత పవిత్ర ఆభరణాలను వెనక్కు తీసుకు వెళ్ళారు. మళ్ళీ ఆలయం ఫిబ్రవరి 13న నెలవారీ పూజల కోసం తెరుస్తారు.

Related posts

హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలి

Satyam NEWS

ఘనంగా భగీరథ జయంతి వేడుకలు

Satyam NEWS

రూ.4,650 కోట్లు అక్రమ తరలింపు అడ్డుకున్న ఈసీఐ

Satyam NEWS

Leave a Comment