37.2 C
Hyderabad
April 30, 2024 14: 35 PM
Slider సంపాదకీయం

దేశ కట్టుబాటుపై అల్ జజీరా విష ప్రచారం

Elezabet puranam

భారత్ లో అమలు జరుగుతున్న లాక్ డౌన్ విజయవంతం అయింది. కరోనా కేసులు వ్యాప్తి చెందడం నిలిచిపోయింది. అక్కడక్కడ కేసులు రిపోర్టు అవుతున్నా కమ్యూనిటీ స్ప్రెడ్ జరగడం లేదు. అంటే అంటు వ్యాధి ప్రబలడం లేదు. ఇదీ వాస్తవ పరిస్థితి.

లాక్ డౌన్ వల్ల దేశ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఆకలితో అల్లాడుతున్నా దేశాన్ని రక్షించుకోవడానికి త్యాగాలు చేస్తున్నారు. మర్కజ్ వెళ్లి వచ్చిన ముస్లింల వల్ల కరోనా దేశం మొత్తం వ్యాపించినా ఎవరూ కూడా బహిరంగంగా వారిని విమర్శించడం లేదు.

పైగా వారికి సహకారం అందిస్తున్నారు. ఆకలితో ఉన్న వారు ముస్లింలా హిందువులా అని చూడకుండా లక్షలాది వాలంటరీ సంస్థలు ఆహారం అందిస్తున్నాయి. ఇది కదా మన భారత దేశం. ఇదే కదా జరుగుతున్నది. ఉత్తర ప్రదేశ్ లో ఒక్క చోట ఆరోగ్య కార్యకర్తలపై ముస్లింలు దాడి చేశారు.

రెండు మూడు చోట్ల వైద్యుల్ని అవమానించారు. అయినా సరే ముస్లింలను ఎవరూ ఏమీ అనలేదు. కేసులు పెట్టలేదు. అరెస్టులు చేయలేదు. ఇదీ వాస్తవ పరిస్థితి కాగా అల్ జజీరా అనే న్యూస్ ఛానెల్ ఏం ప్రచారం చేస్తున్నదో తెలుసా? దేశం మొత్తం కల్లోలంగా ఉందట.

హిందువులు ముస్లింలు కొట్టుకుంటున్నారట. ముస్లింల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్నదని హిందువులు ఆరోపిస్తూ ముస్లింలపై దాడులు చేస్తున్నారట. మన దేశంలో ఉంటూ, మన నీళ్లు తాగుతూ అల్ జజీరా ఛానెల్ కు చెందిన ఢిల్లీ కరస్పాండెంట్ ఎలిజిబెత్ పురానం ఈ మేరకు వార్తలు ప్రపంచానికి చెబుతున్నది.

ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ను అకస్మాత్తుగా ప్రకటించడం వల్ల రోజూ కూలీలు ఆకలితో చచ్చిపోతున్నారని ఎలిజిబెత్ చెబుతున్నది. భారత్ లోని అన్ని పట్టణాలలో పోలీసులు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారట. ప్రజల్ని చిత్ర హింసలు పెడుతున్నారట.

ఉత్తరప్రదేశ్ లో లాక్ డౌన్ అమలు చేసేందుకు పోలీసులు చేస్తున్న కిరాతకాలకు అంతే లేకుండా పోయిందట. లాక్ డౌన్ ఉన్నా కేసులు పెరుగుతూనే ఉన్నాయని, ప్రజలు ఎంతో అసహనంగా ఉన్నారని కూడా ఈ ఎలిజిబెత్ చెబుతున్నది. భారత్ పై విషం చల్లడానికి ఏ కారణం దొరుకుతుందా అని చూసే ఈ అంతర్జాతీయ ఛానెళ్లు మన దేశంలో మనకు మనం విధించుకున్న లాక్ డౌన్ పై అవాకులు చవాకులు పేలుతున్నారు.

ప్రపంచ దేశాలు కట్టడి చేయలేని కరోనాను మనం లాక్ డౌన్ తో కట్టడి చేసుకున్నాం. మనం సక్సెస్ అయ్యాం. మళ్లీ లాక్ డౌన్ పొడిగించుకున్నా దేశంలో ఎక్కడా వ్యతిరేకత రాలేదు. ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రతిపక్ష పార్టీలతో మాట్లాడి ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు.

కష్టాలు అనుభవిస్తున్నా మనం మన దేశాన్ని కాపాడుకుంటుంటే అల్ జజీరా కరస్పాండెంట్ మాత్రం విషం చిమ్ముతున్నది. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ ఎలిజిబెత్ హైదరాబాద్ లో పుట్టింది. పదేళ్ల వయసులో ఆక్లాండ్ వెళ్లిపోయింది. అక్కడ నుంచి మళ్లీ ఢిల్లీలో అల్ జజీరా కరస్పాండెంట్ గా అవతారం ఎత్తింది.

Related posts

డూప్లికేట్ ప్యారాచూట్ ఆయిల్ రెడ్ లేబుల్ టీ పౌడర్ స్వాధీనం

Satyam NEWS

తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన నిషేధం అపచారం

Satyam NEWS

మాస్కులు, గ్లౌజులు తప్పని సరిగా ధరించాలి

Satyam NEWS

Leave a Comment