29.7 C
Hyderabad
May 2, 2024 03: 15 AM
Slider తూర్పుగోదావరి

మా రోడ్లు దారుణం… ఒక్క సారి వచ్చి చూడండి నితిన్ జీ

#GMC Balayogi

సముద్రతీర ప్రాంతం వున్న కోనసీమలో రహదారులు మరీ దారుణంగా వున్నాయని అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ జి యం హరీష్ బాలయోగి అన్నారు.

ఈ మేరకు ఆయన ఢిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి  నితిన్ గడ్కరీ ని కలిశారు. దుర్భరంగా ఉన్న రోడ్లు రైతుల పంటల రవాణాకు, వ్యాపార సరకు రవాణాకు, ప్రజా రవాణాకు తీవ్ర అడ్డంకిగా మారాయని ఆయన అన్నారు.

దేశ సంపదలో కీలక పాత్ర పోషిస్తున్న మత్స్య వ్యాపారం ఉభయగోదావరి జిల్లాలలో అధికంగా ఉందని, ఇక్కడ రహదారులు పాడైపోవడంతో రవాణాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

జాతీయ రహదారుల పరిస్థితి చాలా అధ్వానంగా వుందని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని కోరారు.

ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలోని రహదారులను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని నితిన్ గడ్కరీ ని హరీష్ బాలయోగి కోరారు. ఈ మేరకు ఆయన వినతి పత్రం సమర్పించారు.

Related posts

సెప్టెంబ‌రు 19 నుండి 27 వ‌ర‌కు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు

Satyam NEWS

ఇద్దరు పసిపిల్లలను ఉరి వేసి హత్య చేసిన తల్లి

Satyam NEWS

ఆఫ్గనిస్తాన్ లో బాంబు పేలుళ్లు .. ముగ్గురు మృతి

Sub Editor

Leave a Comment