37.2 C
Hyderabad
April 26, 2024 21: 11 PM
Slider ఆదిలాబాద్

పెద్దోడి రాజ్యం పోవాలి… పేదోడి రాజ్యం రావాలి…

#padayatra

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పెద్దోడి.. గడీల పాలన పోయి…పేదోడి రాజ్యం రావాలని. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా లింబ (బి) గ్రామంలో శివాజీ విగ్రహానికి పూలమాలవేసి, నివాళులు అర్పించారు.

అనంతరం లింబ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ వాళ్లు బయటికి వస్తారని తీవ్రంగా దుయ్యబట్టారు. అసలు లింబ(బి) గ్రామానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని వచ్చాయి  అని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ ముంపు గ్రామ ప్రజలను ఆదుకున్న పాపాన పోలేదన్నారు. సొంత జాగా ఉన్న వాళ్లకి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మూడు లక్షల రూపాయలంటూ కేసీఆర్ మాట తప్పారన్నారు.

అబద్ధం ఆడే వాడే కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని… కేసీఆర్ అంటే… ఖాసీం చంద్రశేఖర్ రజ్వి  అని, తెలంగాణలో రజాకారుల పాలనను కేసీఆర్ చూపిస్తున్నాడని బండి సంజయ్ విమర్శించారు. ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తూ… జైళ్ళలో పెట్టిస్తున్నాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయా? అని స్థానికులను అడిగారు. ఏక్ నిరంజన్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని దుయ్యబట్టారు.

79 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడా? అంటూ ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని…నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని, 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసారని అన్నారు. కెసిఆర్ పాలనలో పెళ్లి చేసుకుందామన్న భయపడే పరిస్థితులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పేదల ప్రభుత్వం ఏర్పడితేనే… మీకు న్యాయం జరుగుతుందని…ఓబీసీ ల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం అని స్పష్టం చేశారు.

నిన్న బాసర త్రిబుల్ ఐటీలో 80 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని విద్యార్థులను పొమ్మనలేక పొగ పెడుతున్నారని విమర్శించారు.అక్కడ ఉన్న కాంట్రాక్టర్ కేసీఆర్ బంధువేనని అన్నారు. పాయిజన్ అయిన విద్యార్థులను కనీసం హాస్పిటల్ కు కూడా తీసుకెళ్లనీయడం లేదని ధ్వజమెత్తారు. అక్కడ నిర్బంధం విధించి, విద్యార్థుల ఉసురు తీసుకుంటున్నాడని బండి సంజయ్ అన్నారు.అన్ని స్కామ్లలో ఉన్నది కేసీఆర్ కుటుంబమే ఉందని తీవ్రంగా ఆరోపించారు.కేంద్రం ఇస్తున్న నిధులను కేసీఆర్ దారిమళ్లిస్తున్నాడని ఆరోపించారు.

Related posts

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం

Satyam NEWS

తెలంగాణ ఆదర్శ పాలనకు ఇది నిదర్శనం

Satyam NEWS

ప్రజా రాజధాని అమరావతిని కేంద్రం కాపాడాలి

Satyam NEWS

Leave a Comment