38.2 C
Hyderabad
April 29, 2024 19: 20 PM
Slider కవి ప్రపంచం

సంస్కరణల‌ స్రష్ట

#Sandhya Sutravey

దత్తతపుత్ర స్థాయినుండి

అత్యున్నత స్థాయికి

దక్షిణాది నుండి తొలి తెలుగు నవ ప్రధానిగా,

ఏపీ చతుర్థ  ముఖ్యమంత్రిగా

నిరాడంబరుడిగా

న్యాయవాదిగా

ఉద్యమకారునిగా

కవి,సాహితీవేత్తగా

అపర చాణక్యుడిగా

బహుభాషాకోవిదునిగా

దిశానిర్దేశకునిగా

నిస్వార్థిగా, వ్యాసకర్తగా

వాక్పటిమ గల వక్తగా

కాకతీయ పత్రిక నిర్వాహకునిగా

కాంగ్రెస్ పార్టీకి చుక్కానిగా

వివాదాలకు అతీతునిగా

తనదైన ఆర్థిక ,భూసంస్కరణలతో

దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన

తెలివి మంతునిగా

అలనాటనే కంప్యూటర్

పరిజ్ఞానాన్ని అలవోకగా

అదిమి పట్టిన మేధావిగా

సహస్రఫణ్ హింది అనువాదకునిగా

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతగా

ఇన్సైడర్ ఆత్మకథ రచయితగా

నిశ్శబ్దంగా దేశానికి మేలుచేసిన ప్రధానిగా

పీవీ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ను

తన స్మృతికైగైకొన్న మహోన్నతునిగా

వామననామ సార్దకేయుడు పీవీగా

ఎదిగినకొద్ది ఒదిగిపోయే గుణశీలి

శతజయంతి ఉత్సవాల సందర్భంగా

గైకొనుము నాఅక్షరాంజలి

సంధ్య సుత్రావె, హైదరాబాద్, ఫోన్ నంబర్ 9177615967

Related posts

గ్రాడ్యుయేట్ ఓటర్లను చేర్చేందుకు కార్యాలయం

Satyam NEWS

‘మీతోనే మేం దేనికైనా’ కరపత్రాల పంపిణీ

Bhavani

ముషీరాబాద్ లో 90 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులు

Bhavani

Leave a Comment