కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్యాంక్ సేవల వేళలను మార్పు చేస్తున్నట్లు కడప జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు ఆచారి తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 2 వరకే బ్యాంక్ లు ఉంటాయని, బాంక్ చెక్ క్లియరింగ్, డిపాజిట్స్, విత్ డ్రాయల్ మాత్రమే జరుగుతాయని తెలిపారు. అకౌంట్ ఓపెనింగ్, ఇతర సేవలను నిలిపిస్తున్నట్లు తెలిపారు. కేవలం 50 శాతం సిబ్బందితోనే బ్యాంకులు పని చేస్తాయని ఆయన వివరించారు. అన్ని ఎటిఎం కేంద్రాలలో డబ్బులు ఎప్పటికప్పుడు నింపుతామని అన్నారు. ఖాతాదారులు గుంపులు గుంపులుగా ఎటిఎం కేంద్రాల వద్దకు వెళ్లవద్దని ఆయన కోరారు. వైవియు, రిమ్స్ మెడికల్ కాలేజి లోని ఎస్బిఐ బ్రాంచ్ లని తాత్కాలికంగా మూసి వేస్తున్నామని ఆయన తెలిపారు.