38.2 C
Hyderabad
April 29, 2024 19: 12 PM
Slider హైదరాబాద్

బాబు విడుదలతో మిన్నంటిన సంబరాలు

#tarnaka

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ పై హర్షం వ్యక్తం చేస్తూ తార్నాక కమ్మవారి సేవా సంఘం, బాబు అభిమానుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి తార్నాక, హబ్సిగూడ ప్రధాన రహదారిపై అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుతూ జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. అటుగా వెళుతున్న వాహనదారులకు సైతం స్వీట్లు అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి శ్రేయస్సు కోరిన చంద్రబాబు పై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని బాబు కూడా నిర్దోషిగా కడిగిన ముత్యంలా నిలుస్తారని తార్నాక కమ్మవారి సేవా సంఘం ప్రతినిధులు, బాబు అభిమానులు తెలిపారు.

తార్నాక, సత్యం న్యూస్

Related posts

రిషి సునక్ తో ప్రధాని మోదీ భేటీ

Bhavani

వి.ఆర్.ఎ ల న్యాయమైన పోరాటానికి ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు

Satyam NEWS

మైనారిటీ ఓట్ల కోసం సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు

Satyam NEWS

Leave a Comment