బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధం అయింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఆడ బిడ్డలందరికీ ఈ నెల 23వ తేదీ నుంచి ఈ బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనను మంత్రి కేటీఆర్ నేడు సందర్శించారు. బతుకమ్మ చీరలను మంత్రి కేటీఆర్ పరిశీలించి వారిని ప్రశంసించారు. 18 సంవత్సరాలు పైబడి తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ఆడ బిడ్డలందరికీ ఈ నెల 23వ తేదీ నుంచి ఈ బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు.
previous post
next post