32.7 C
Hyderabad
April 27, 2024 01: 56 AM
Slider ముఖ్యంశాలు

“తెలంగాణ బత్తాయి డే” బ్రోచర్ ఆవిష్కరణ

#Battai Day

శరీరంలో అనేక చర్యలు సాఫీగా జరగాలంటే విటమిన్‌ సి తప్పనిసరని ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం ప్రగతి భవన్ లో తెలంగాణ బత్తాయి డే బ్రోచర్ ను ఆయన ఆవిష్కరించారు. మే 10 న నిర్వహించే “తెలంగాణ బత్తాయి డే” ని పురస్కరించుకొని ప్రజలు పెద్ద ఎత్తున బత్తాయి పండ్లను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బత్తాయి పండ్లను తినటం వల్ల కలిగే లాభాలను విడమర్చి చెప్పారు. మిటమిన్‌ సి పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల రోజువారి దినచర్య సాఫీగా సాగుతుందని అన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బత్తాయి పండ్లను పుష్కలంగా తినాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు.

బత్తాయి పండ్లలో యాంటి యాక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరం చురుగ్గా ఉండటంతో పాటు ఎముకల పటుత్వం, కంటి చూపు మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. స్కర్వీ వ్యాధి నివారణకు, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి సి విటమిన్ పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లు దివ్యౌషధంగా పనిచేస్తయని ఆయన అన్నారు. బత్తాయి పండ్లను బాగా తినటం వల్ల శరీరం పోషకాలను బాగా గ్రహించి రోగనిరోధక వ్యవస్థ పెంపొందుతుందని అన్నారు. బత్తాయి పండ్లను కొనుగోలు చేసి వాటిని సాగుచేసే రైతులను ఆదుకోవాలన్న సీఎం కెసిఆర్ మాటలను సంతోష్ కుమార్ గుర్తు చేశారు.మే 10న  ఒకే రోజు  2020కు సరఫరా  చేసేందుకు ఏర్పాట్లను చేసిందని వాక్‌ ఫర్‌ వాటర్‌ వెల్లడించింది.

Related posts

బీజేపీ అగ్రనేత ఎల్.కే.అద్వానీకి అస్వస్థత

Satyam NEWS

మారియుపోల్ ను స్వాధీనం చేసుకున్న రష్యా సేనలు

Satyam NEWS

సిఎం కేసీఆర్ లక్ష్య సాధన కోసం పని చేస్తా

Satyam NEWS

Leave a Comment