బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. గత ఐదు రోజులుగా అద్వానీ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని పార్టీ కార్యాలయం ఓ ప్రకటన వెల్లడించింది. అందువల్ల ఆగస్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా అద్వానీ ఇంటి వద్ద జెండా వందనం కార్యక్రమం నిర్వహించడం లేదని తెలిపింది. ప్రతి ఏటా అద్వానీ ఇంటి వద్ద స్వాతంత్ర్య దినోత్సవం నాడు బిజెపి జెండా వందన కార్యక్రమం నిర్వహిస్తుంది. అయితే అనారోగ్యం కారణంగా దాన్ని ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అద్వానీ వయస్సు 91 ఏళ్లు. బీజేపీ సహ వ్యవస్థాపకుడైన అద్వానీ పార్టీ పటిష్టతకు విశేష కృషి చేశారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న హయాంలో ఉపప్రధానిగా ఆయన పనిచేశారు.
previous post