37.2 C
Hyderabad
April 26, 2024 20: 16 PM
Slider ఆదిలాబాద్

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

#BatukammaSarees

పేద ఆడపడుచులు కూడా  బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

 నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  లాంఛనంగా ప్రారంభించారు.TNGOs భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు మంత్రి అల్లోల బతుకమ్మ చీరలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా సుమారు రూ. 317 కోట్లు ఖర్చు పెట్టి కోటి  మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందన్నారు. 

రాష్ట్ర పండుగైన బతుకమ్మ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా చీరల పంపిణీ చేస్తున్నట్లు, ఇందుకోసం  287 కు పైగా డిజైన్ల చీరలు అందుబాటులో ఉంచామని తెలిపారు.

మహిళలందరికి పెద్దన్నగా మారి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగకు చీరలను ఇస్తున్నారని పేర్కొన్నారు. 18 ఏళ్ళు నిండి, తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి చీరలు అందిస్తున్నామని చెప్పారు.

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రాడ్యుయేట్లు ఓటు నమోదు చేసుకోవాలి

Satyam NEWS

భూములను ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు

Satyam NEWS

సీఆర్ఫీఎఫ్ అమరులకు రూ.35 లక్షల ఎక్స్ గ్రేషియా

Sub Editor

Leave a Comment