28.7 C
Hyderabad
April 28, 2024 06: 13 AM
Slider వరంగల్

నేటి నుండి మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణి

#MuluguCollector

శుక్రవారం నుండి బతుకమ్మ చీరెల పంపిణీ చేపట్టనున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య ప్రకటించారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండి, తెల్ల రేషన్ కార్డులో నమోదయిన మహిళలు అందరికి చీరెల పంపిణీ చేస్తామన్నారు.

 జిల్లాలో అర్హులైన ఒక లక్షా 6 వేల 882 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు ఆయన అన్నారు. ములుగు మండలంలో అధికంగా 21 వేయి 553, మంగపేట మండలంలో 16 వేల 972, వెంకటాపురం మండలంలో 11 వేల 733, గోవిందరావు పేట మండలంలో 11 వేల 644, ఏటూరునాగారం మండలంలో 10 వేల 506,

వాజేడు మండలంలో 9 వేల 497, తాడ్వాయి మండలంలో 7 వేల 997, కన్నాయిగూడెం మండలంలో 4 వేల 420 మంది లబ్దిదారులున్నట్లు ఆయన అన్నారు. పంపిణీకి సంబంధించి చీరెలు జిల్లాకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు.

గ్రామాల్లో బతుకమ్మ చీరెల పంపిణీకి గ్రామ కార్యదర్శి, మహిళ సంఘాలు, రేషన్ డీలర్లతో టీమ్ లు ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్-19 నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని చీరెల పంపిణీ పూర్తిచేయాలన్నారు.

Related posts

పాలసీలు ఇవ్వడానికి భయపడుతున్న బీమా కంపెనీలు

Satyam NEWS

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన తహశీల్దార్ జయశ్రీ

Satyam NEWS

సమరత సేవా ఫౌండేషన్ హిందూ ధర్మ ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

Bhavani

Leave a Comment