40.2 C
Hyderabad
April 29, 2024 17: 20 PM
Slider నల్గొండ

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన తహశీల్దార్ జయశ్రీ

#10thclass

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రంలోని 10వ,తరగతి పరీక్షా కేంద్రాలను తహసిల్దార్ వజ్రాల జయశ్రీ,మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ శనివారం పరిశీలించారు.

అనంతరం తహసిల్దార్ వజ్రాల జయశ్రీ,మండల విద్యాధికారి భూక్య సైదా నాయక్ మాట్లాడుతూ
హుజూర్ నగర్ మండలంలో పదవ తరగతి పరీక్షలకు 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని,ప్రభుత్వ ఉన్నత పాఠశాల హుజూర్ నగర్,జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల,వి.వి. ఎం పాఠశాల,శ్రీ చైతన్య పాఠశాల, కృష్ణవేణి పాఠశాల లకు విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం జరుగుతుందని అన్నారు.పరీక్షలు 23వ,తేది నుండి జూన్ మొదటి తారీకు వరకు పరీక్షలు ఉదయం 9:30 నుండి 12 :45 నిమిషముల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం గంట ముందు చేరుకోవాలని,పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సౌకర్యం కొరకు నీటి వసతి,విద్యార్థులు పరీక్ష రాయడానికి బెంచీలు,కరెంటు,కనీస మౌళిక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని,పరీక్షా కేంద్రం సిసి కెమెరా నిఘాలో ఉంటుందని,పరీక్ష కేంద్రానికి సెల్ ఫోన్స్ అనుమతి లేదని, మండలంలో పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతంలో 144 సెక్షన్ విధించడం జరిగిందని,ఆ సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసి వేయబడతాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆయా పరీక్షా కేంద్రాల ఛీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

Related posts

భద్రాద్రి రామయ్య భూములను కాపాడుతాం

Bhavani

సమ్మె నోటీసు ఇచ్చిన ఆటో కార్మిక జేఏసి

Sub Editor 2

సెలూన్ హెయిర్ క్రష్ లో సెలెబ్రిటీల సందడి

Satyam NEWS

Leave a Comment