33.7 C
Hyderabad
April 28, 2024 00: 57 AM
Slider హైదరాబాద్

బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంతో నూతన శకం

#ministergangulakamalakar

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ భగాయత్  మేర, మేదర కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఏక సంఘంగా ఏర్పడిన ఆయా మేర, మేదరి సంఘాల ఆత్మగౌరవ భవన నిర్మాణాల ట్రస్ట్ లు ఈ భవన నిర్మాణాలను చేపడుతున్నాయి. ప్రభుత్వం ఉప్పల్ భగాయత్ లో మేర, మేదర కులస్తుల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం చెరో ఎకరా భూమి చెరో కోటి రూపాయలు మంజూరు చేసింది.

ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీసీలు వెనుకబడిన వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డామన్నారు. స్వాతంత్రం వచ్చిన 74 ఏళ్ల లో ఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి బీసీలను పట్టించుకోలేదని, కనీస వసతి కోసం గుంట జాగ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ కులాల ఆత్మగౌరవంతో తలెత్తుకు బతకాలని హైదరాబాద్ నడిబొడ్డున కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన స్థలాల్ని కేటాయించారని, 41 బీసీ కులాలకు ఎనభై మూడు ఎకరాలు కేటాయించారన్నారు.

అంతేకాకుండా భవనాలు నిర్మించుకోవడానికి సైతం ఎకరాకు కోటి రూపాయల కేటాయించారన్నారు.  అందులో భాగంగానే ఈరోజు ఉప్పల్ భగాయత్ లోని మేర, మేదర కులస్తుల ఆత్మగౌరవ భవన నిర్మాణాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతోనే ఈరోజు ఇక్కడ భూమి పూజ నిర్వహించుకుంటున్నామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 74 ఏళ్ల లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీసీలకు కేవలం 16 గురుకులాలు మాత్రమే ఏర్పాటు చేసాయని, బీసీ బిడ్డలు కూలి పనులకు వెళ్లకుండా చదువుకుంటారని,  ఏ ప్రభుత్వాన్ని కోరినా కనీసం కనికరం చూపలేదు అన్నారు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు ఉన్నత విద్యను అందించాలని వాటిని 281 పెంచారని తెలిపారు. గతంలో కేవలం పదివేల మంది మాత్రమే చదివితే నేడు1,36,000 మంది చదువుతూ ప్రతీ ఏడు లక్షలాది మంది బిడ్డలు ఇంగ్లీష్ మీడియంతో అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారని మంత్రి గంగుల అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణ మోహన్ రావు, హైదరాబాద్ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్, ఉపేంద్ర, మేర, మేదర కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం

Satyam NEWS

నిత్యావసరాలు పంచిపెట్టిన అంబర్ పేట్ శంకర్

Satyam NEWS

ప్రైవేట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా

Satyam NEWS

Leave a Comment