28.7 C
Hyderabad
April 28, 2024 05: 43 AM
Slider మహబూబ్ నగర్

ప్రైవేట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా

#PrivateTeachers

ప్రైవేట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం  అధ్యక్షుడు గౌరీ సతీష్ అన్నారు.

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ ఎమ్ కళాశాలలో  శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ సాంబయ్య గౌడ్ అధ్యక్షతన ప్రైవేట్ అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరీ సతీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు, నియామకాలు, ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో పోరాడి సాధించుకున్న  తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం  నిరుద్యోగుల ఆశలపై నీళ్ళు చల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

టి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధులు,నియామకాలు, ఎక్కడికి పోయివని ప్రశ్నించారు.  నిర్లక్ష్యంతో విద్య వ్యవస్థ నీరు గారి పోయిందని, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో ఉద్యోగాలు భర్తీలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ధనిక రాష్ట్రం అని ప్రగల్బాలు  పలికిన ప్రభుత్వం

నిధుల కొరత అంటు నియామకాలు చేపట్టాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సామాజిక తెలంగాణ పేరుతో ప్రజలను  ప్రభుత్వం తప్పుదోవపట్టిస్తుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరి ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు.

గత ఏడేళ్లుగా డి ఎస్  సి వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని తెలిపారు. పాలమూరు యూనివర్సిటీ లో 90% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అభివృద్ధి విషయంలో ఉత్తర తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తూ, దక్షిణ తెలంగాణ ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడం చాలా భాధకరమన్నారు.

మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదని మా ప్రాంతం అభివృద్ధి చెందాలనేధే మా ఆకాంక్ష  అని అన్నారు. విద్య రంగం కుదేలవుతుంటే ప్రభుత్వం ఎందుకు నోరుమోదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రైవేటు పాఠశాలల నాయకులు గాలయ్య, టిఎల్ ఎఫ్ నాయకులు సదానంద గౌడ్ ,ప్రైవేట్ కళాశాల యజమాన్యాలు, అధ్యాపకులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రేపు గవర్నర్ తో భేటీ కానున్న సిఎం జగన్

Satyam NEWS

బీ అలెర్ట్:సహకార ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు

Satyam NEWS

నిబంధనలు అతిక్రమించిన ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోండి

Satyam NEWS

Leave a Comment