29.7 C
Hyderabad
April 29, 2024 08: 09 AM
Slider మహబూబ్ నగర్

బిసి కులాలు ఐక్యంగా ముందుకు రావాలి

#BCAssociation

వెనుకబడిన తరగతుల అభివృద్ధి జరగాలంటే బీసీ కులాలు ఐకమత్యంగా ముందుకు రావాలని బీసీ కమిషన్ జాతీయ సభ్యులు తల్లోజు ఆచారి తెలిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని శ్రీ సాయిరాం ఫంక్షన్ హాల్ లో జరిగిన బీసీ కులాల సమస్యల సాధనకై జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 55 శాతం బీసీలు ఉన్నారని కానీ రాజ్యాధికారంలో వెనుకబడ్డారు అని అన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ముందుండాలంటే బీసీ కులస్తులు ఏకం కావాలని ఆయన తెలిపారు. బీసీ కులస్తులకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. బీసీల అభివృద్ధికి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు.

కులవృత్తులను ప్రోత్సహించాలన్నారు. ఇంత వరకు రాష్ట్రంలో బీసీలు కార్పొరేషన్ చైర్మన్లు కాలేదన్నారు. అనేకమంది ఇల్లు లేకుండా ఉన్నారని పునరావాస కేంద్రాలలో ఇల్లు లేని వారి జాబితాను ఇవ్వాలన్నారు. బీసీల సమస్యల కొరకు సావర్కర్ 20 ఏళ్ల జైలు జీవితం గడిపారని  ప్రస్తుతం బీసీల కొరకు ఎవరు జైలుకు వెళతారని అని ప్రశ్నించారు.

బీసీలు ఐకమత్యంగా ఉంటేనే అన్ని రంగాలలో అభివృద్ధి సాధించవచ్చని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ అధ్యక్షతన జరగగా దుర్గయ్య, కనకాల శ్యాం, శేఖర్, కాశన్న యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సింగం నగేష్, యుగంధర్ నాయుడు, భీమన్న నాయుడు, అరవింద చారి, అంజన్న యాదవ్, దేవన్న ,రాఘవేంద్ర గౌడ్, కావలి అశోక్  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

ఉల్లి నిల్వలపై విజిలెన్స్ దాడులు

Satyam NEWS

ఐదు కుటుంబాలకు డ్రై రేషన్ అంద‌జేత‌

Sub Editor

రాజకీయ పార్టీలను చేర్చుకుంటే మీ ప్రయోజనాలకే దెబ్బ

Satyam NEWS

Leave a Comment