33.7 C
Hyderabad
April 27, 2024 23: 51 PM
Slider మహబూబ్ నగర్

గద్వాలలో ప్రభుత్వ భూమి పొందిన బిసిలకు న్యాయం చేస్తా

#tallojuchari

జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ స్థలాలు పొందిన బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జాతీయ బిసి కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2013 సంవత్సరం లో బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలను కేటాయించింది.

అక్కడ వారంతా ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా ఆ స్థలాన్ని నర్సింగ్ కాలేజీకి కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది, గద్వాల్ పట్టా ప్లాట్ల బాధితుల సంఘం అధ్యక్షుడు పూజరి శ్రీధర్, ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ నేషనల్ కోఆర్డినేటర్ మురహరి బుద్దారాం జాతీయ బిసి కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అవార్డు నెం. 03/2012, ఫైల్ నం. 560/2012 తేదీ. 25-08-2012 ద్వారా భూమిని బిసిలకు నివాస స్థలాలుగా కేటాయించారని న్యాయవాది పూజరి శ్రీధర్, పూజరి శ్రీనిత, కౌన్సిలర్స్ రామాంజనేయులు, గంజి పేట శంకర్ సీనియర్ సిటిజన్ ఫోరం మోహనరావు కమిషన్ కు వివరించారు.

ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న బిసి కమిషన్ జోగులంబా జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. ఆయన తరపున జాయింట్ కలెక్టర్ వ్యక్తిగతంగా బిసి కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఆ సర్వే నంబర్లలో పట్టాలు కేటాయించారా? కేటాయించ లేదా? కేటాయిస్తే ఎంత మందికి ఇచ్చారు? ఇలా చేస్తే బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల లబ్దిదారుల పరిస్థితి ఏమిటి అని తల్లోజు ఆచారి అధికారులను ప్రశ్నించారు. అధికారులు తప్పు చేస్తే తాను దగ్గరుండి ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Related posts

తొలి టీ20లో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

Satyam NEWS

నిరుపేద కుటుంబానికి అండగా బండారి లక్ష్మారెడ్డి

Satyam NEWS

వరదల్లో కొట్టుకెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన సైబరాబాద్ పోలీసులు

Satyam NEWS

Leave a Comment